“విజయ్ దేవరకొండ” మాటల వెనుక ఉద్దేశం ఏంటి..? ఫైర్ అవుతున్న “మహేష్ బాబు” ఫ్యాన్స్..!

“విజయ్ దేవరకొండ” మాటల వెనుక ఉద్దేశం ఏంటి..? ఫైర్ అవుతున్న “మహేష్ బాబు” ఫ్యాన్స్..!

by Anudeep

Ads

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించాలి అనుకున్న సినిమా ‘జనగనమన’ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఒక ఇంటర్వ్యూలో ” మహేష్ బాబు కేవలం హిట్ డైరెక్టర్ తో మాత్రమే పనిచేస్తారని ఫ్లాప్ డైరెక్టర్స్ ని అసలు పట్టించుకోరని ” పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ కి హర్ట్ అయిన మహేష్ బాబు ఆ సినిమాని రిజెక్ట్ చేశారు.

Video Advertisement

ఆ తర్వాత ఈ సినిమా కథను చాలామంది హీరోల దగ్గరకు తీసుకువెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది అటు తిరిగి ఇటు తిరిగి చివరకు విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చి చేరింది. అయితే ఈ మూవీపై రీసెంట్గా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు మహేష్ బాబు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి.

vijay devarakonda comments on mahesh babu going viral

ఈమధ్య ఈ సినిమాకు సంబంధించి హీరో ఎవరు అనేదానిపై అధికారికంగా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ” మహేష్ సార్ అంటే నాకు చాలా ఇష్టం….. ఆయన చేయలేక పోయింది నేను చేసి చూపిస్తాను….. వాళ్లంతా గర్వపడేలా చేస్తాను” అని విజయ్ దేవరకొండ ఇచ్చిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట సంచలనం రేపాయి. మొదటినుంచి మహేష్ బాబు ఫ్యాన్ అయిన విజయ్ దేవరకొండ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా టికెట్ల కోసం ఎంతో కష్టపడే వాడినని పోకిరి తన ఆల్ టైం ఫేవరెట్ అని ఎన్నో సందర్భాల్లో పేర్కొన్నారు.

why mahesh babu opted out from jana gana mana

మహేష్ బాబు పై విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ మంచి ఉద్దేశంతో ఒక స్టార్ హీరో దగ్గర ప్రశంస పొందాలి అన్న ఆలోచనతో ఉన్నప్పటికీ అది నెట్లో ఇంకోలాగా కన్వే అయ్యింది.‘మహేష్‌కి చేతకాలేదు, అది నేను చేసి చూపించి, హిట్టు కొడతా..’ అని విజయ్ దేవరకొండ అన్నట్లు నెగిటివ్గా అతని మీద ప్రచారం జరుగుతుంది. దీంతో కోపగించుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఆన్లైన్ సాక్షిగా తమ కామెంట్లతో విజయ్ దేవరకొండను ఉతికారేస్తున్నారు.


End of Article

You may also like