క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)- 2023 షురూ అయ్యింది. ఎప్పుడూ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా ఉండే సినీ తారలు క్రికెట్ మైదానంలోకి దిగారు. బ్యాట్, బాల్ పట్టుకుని మైదానంలో సందడి చేస్తున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భారత చిత్ర పరిశ్రమలోని 8 భాషలకు చెందిన 8 జట్లు పాల్గొంటున్నాయి. దేశంలోని ప్రముఖ సినీ నటులు పాల్గొనే ఈ స్పోర్టెయిన్‌మెంట్ లీగ్ 2011లో ప్రారంభమైంది. ఈ సీజన్లో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 19న హైదరాబాద్‌లో జరగనుంది.
Video Advertisement
అయితే తాజాగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో టాలీవుడ్ జట్టు దుమ్ము రేపింది. కేరళ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాయ్‌పూర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. తర్వాత కేరళ స్ట్రయికర్స్ 5 వికెట్ల నష్టానికి 98 రన్స్ మాత్రమే చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అఖిల్ 19 బంతుల్లోనే 65 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో వారియర్స్ 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని కేరళ ముందు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆ జట్టు 6 వికెట్లు నష్టపోయి 105 పరుగులు మాత్రమే చేసింది.
ప్రొఫెషనల్ క్రికెటర్ అయిన టాలీవుడ్ కెప్టెన్ అక్కినేని అఖిల్ 30 బంతుల్లోనే 91 పరుగులతో చెలరేగాడు. కొద్దిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ.. జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన అఖిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయాన్ని ఇంతకు ముందు జట్టులో సభ్యుడిగా ఉన్న తారకరత్నకు అంకితం ఇస్తున్నట్లు అఖిల్ ట్వీట్ చేశాడు.
తెలుగు వారియర్స్ తన తదుపరి మ్యాచ్‌ను జైపూర్ వేదికగా మార్చి 5న ఆర్య నేతృత్వంలోని చెన్నై రైనోస్‌తో ఆడనుంది. తెలుగు వారియర్స్ జట్టుకు సచిన్ జోషి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే తెలుగులో ‘జీ సినిమాలు’ ఛానెల్ ద్వారా సీసీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అయితే తాజాగా కేరళ జట్టు తో జరిగిన మ్యాచ్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18