Ads
ఎంతో ఘనంగా ఐపీఎల్ 2024 నిన్న ప్రారంభం అయ్యింది. చెన్నై వేదికగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి మధ్య జరిగిన ఈ పోటీలో, 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి విజయం అందుకుంది. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. విరాట్ కోహ్లీ (20 బంతుల్లో 21) చేయగా, ఫాఫ్ డుప్లెసిస్ 23 బంతుల్లోనే 35 రన్స్ స్కోర్ చేశారు. దాంతో 4.2 ఓవర్లలో ఆర్సీబీ 41/0 స్కోర్ తో నిలబడింది.
Video Advertisement
ఆ తర్వాత వచ్చిన అనుజ్ రావత్ (48), దినేశ్ కార్తిక్ (38) చేశారు. అప్పటికే 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టుని వీళ్లు ముందుకు నడిపించారు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 రన్స్ స్కోర్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 1 వికెట్ పడగొట్టారు.
దాంతో 174 పరుగుల లక్ష ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బరిలోకి దిగింది. కివీస్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 15 బంతుల్లో 37 పరుగులు చేశారు. రచిన్ రవీంద్ర ఐపీఎల్ ఆడడం ఇది మొదటిసారి.అజింక్య రహానే 19 బంతుల్లో 27, శివమ్ దూబె 28 బంతుల్లో 34, రవీంద్ర జడేజా 17 బంతుల్లో 25 రన్స్ స్కోర్ చేశారు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18.4 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి విజేతగా నిలిచింది. బెంగళూరు జట్టు బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు, కర్ణ్ శర్మ 1 వికెట్, యశ్ దయాల్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ మీద ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
ALSO READ : కెప్టెన్ కూల్ “ధోని” ఇరుక్కున్న 5 కాంట్రవర్సిలు ఏంటో తెలుసా.? 5 వ ది చాలామందికి తెలియకపోవచ్చు.!
End of Article