“మీరు రష్మిక కోసం చూస్తారు…మేము దివ్య కోసం చూస్తాము”..అంటూ “పుష్ప” ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 9 మీమ్స్.!

“మీరు రష్మిక కోసం చూస్తారు…మేము దివ్య కోసం చూస్తాము”..అంటూ “పుష్ప” ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 9 మీమ్స్.!

by Megha Varna

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది ఓ రేంజ్ లో ఉండి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో ఈ విషయం గమనించారా..?

Video Advertisement

Also Read: ఇదెక్కడి ఎడిటింగ్ రా మావా.. “పుష్ప” లో అనసూయని ఇలా ఎడిట్ చేశారేంటి..?

divya sripada

రష్మిక అడవిలోనే బండి నడుపుతూ ఉంటుంది. వెనకాల మరో ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు. వెనకాల కూర్చున్న అమ్మాయిని ఎవరో గుర్తు పట్టారా..? ఆమె ఎవరో కాదు దివ్య శ్రీపాద. యు ట్యూబ్ లో గర్ల్ ఫార్ములా లో వీడియోస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్య శ్రీపాద కలర్ ఫోటో సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసింది. తాజాగా.. పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలో అవకాశము కొట్టేసింది. నిజంగా కష్టపడితే సక్సెస్ తప్పకుండ వస్తుంది అనడానికి ఆమె ఓ ఉదాహరణ.

దివ్య ని మనలో చాలా మంది అంతకుముందు చాయ్ బిస్కెట్, గర్ల్ ఫార్ములా వీడియోస్ లో చూసే ఉంటాం. దివ్య యాక్టింగ్ లోకి అడుగుపెట్టక ముందు ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కానీ ఉద్యోగం నచ్చక, ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. గర్ల్ ఫార్ములా లో ఆడిషన్ లో సెలక్ట్ అయ్యారు దివ్య. 2019 లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో దివ్య మొదటి సారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించారు దివ్య.

తర్వాత కలర్ ఫోటో సినిమాలో, మిడిల్ క్లాస్ మెలోడీస్ లో, అలాగే మిస్ ఇండియా, జాతి రత్నాలు సినిమాలో కూడా నటించారు దివ్య. అయితే ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా  ట్రైలర్ లో రష్మిక తో పాటు దివ్య కూడా కనిపిస్తారు. ప్రస్తుతం ఈ విషయంపై మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#1

#2#3#4#5

#6

#7.

#8.

#9.


End of Article

You may also like