Ads
శ్రీలంకపై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో కీలక సమరానికి సిద్ధమైంది. కివీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. బుధవారం తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాంట్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. భారత్ నాలుగో స్థానంలో ఉంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పొడిగా ఉండటం.. రాత్రి వేళ మంచు ప్రభావం ఉండే అవకాశం లేకపోవడంతో.. రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపాడు.
Video Advertisement
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యతోపాటు.. సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతున్నాడు. కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో.. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (208) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28) పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో షిప్లే, మిచెల్ చెరో రెండు వికెట్లు తీయగా.. ఫెర్గ్యూసన్, టింక్నర్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.
19 ఫోర్లు, 9 సిక్స్‌లతో న్యూజిలాండ్ బౌలర్లను శుభ్‌మన్ గిల్ చితక్కొట్టాడు. టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్, విరాట్, సూర్య విఫలమైనా.. శుభ్‌మన్ గిల్ హీరో ఇన్నింగ్స్ తో 350 పరుగుల భారీ లక్ష్యంతో కివీస్ బరిలోకి దిగింది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article