Ads
క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీయల్ 2023 మినీ వేలం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 ఫ్రాంచైజీ లు పాల్గొంటున్నాయి. ఐపీయల్ కొత్త చైర్మన్ అరుణ్ ధుమాల్ వేలం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ఆక్షన్ లో మొత్తం 405 మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే వీరిలో 87 మందికే చోటు లభించనుంది. ఇందులో ఎవరికీ చోటు లభించనుంది అన్నది ఆసక్తి కరంగా మారింది.
Video Advertisement
అయితే ఈ ఏడాది కేన్ విలియంసన్, జో రూట్, బెన్ స్టోక్స్, సామ్ కరణ్, నికోలస్ పూరన్ వంటి స్టార్ క్రికెటర్లు ఈ ఏడాది టోర్నీ మొత్తం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాన్నీ ఆయా దేశాల క్రికెట్ బోర్డు లు ద్రువీకరించినట్లు వెల్లడించారు. కాగా ప్రముఖ వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడ్స్ ఈ వేలాన్ని నిర్వహించనున్నారు.
అయితే ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కోసం వెతుకుతుండగా, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ విన్నర్ల కోసం చూస్తోంది. రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు బౌలర్ల కోసం చూస్తుండగా, ముంబై ఇండియన్స్ పోలార్డ్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం చూస్తున్నారు. ఈ సారి బాలీవుడ్ నటి ప్రీతీజింటా వేలం లో పాల్గొంటున్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన మొదటి సెట్ లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరు మొదటిస్థానం లో నిలిచింది. 2 కోట్ల బేస్ ధర తో గుజరాత్ టైటాన్స్ బిడ్డింగ్ స్టార్ట్ చేసింది. బెన్ స్టోక్స్ ని 16 . 5 కోట్లకు చెన్నై టీం గెలుచుకుంది. ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరణ్ ని 18 . 5 కోట్లకు పంజాబ్ గెలుచుకుంది. ఇతడు ఐపీయల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
అయితే ఈ వేలం పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
End of Article