పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గతేడాది మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటించింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Video Advertisement
బాహుబలి చిత్రం తర్వాత వచ్చిన సాహో చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడం తో.. డార్లింగ్ ఫాన్స్ ఈ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. మొత్తంగా ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల అయ్యింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా హిందీ వెర్షన్‌కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తెలుగు వెర్షన్‌కు ఎస్ఎస్ రాజమౌళి గొంతు సవరించారు.
స్టోరీ, స్క్రీన్ ప్లే లో క్లారిటీ లోపించడంతో ఈ సినిమా థియేటర్ లో ఘోరంగా విఫలం అయ్యింది.యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు.ఈ సినిమాతో యూవీ వారికీ గట్టిగానే పడింది.ఏకంగా 70-80 కోట్ల నష్టాలను మిగిల్చిందని వార్తలు వచ్చాయి. అయితే మొత్తంగా రెండున్నర ఏళ్ళ గ్యాప్ తర్వాత ప్రభాస్ ఈ చిత్రం తో అభిమానుల ముందుకి వచ్చారు. ప్రభాస్ ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. సాహో కంటే ఈ సినిమాలో చాలా ఫ్రెష్ అండ్ స్టయిలిష్ లుక్‌లో కనిపించారు. ఇక పూజా హెగ్డే చాలా అందంగా ఉంది.
రొటీన్ ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ‘రాధే శ్యామ్’ను పీరియాడిక్ మూవీగా యూరప్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాను తెరకెక్కించే సమయంలోనే కరోనా ప్రారంభమైంది. దాదాపు రెండేళ్ల పాటు యూనిట్ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సినిమాను పూర్తి చేయడం గొప్ప విషయమని చెప్పాలి. సినిమాను ఇటలీ, జార్జియా వంటి దేశాల్లో కొన్ని రోజుల పాటు చిత్రీకరించారు.
అయితే ప్రభాస్ నటించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చి వన్ ఇయర్ అయినా సందర్భంగా నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15