పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ‘హరిహర వీరమల్లు‘. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ రూపొందుతోంది. మరొకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకోటి ‘వినోదయ సీతమ్‘ అనే తమిళ సినిమా రీమేక్ చేస్తున్నారు. ఇవే కాకుండా సాహో డైరెక్టర్ సుజీత్ తో మరో చిత్రం ప్రకటించారు పవన్.
Video Advertisement
`ఓజీ`(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. తాజాగా సోమవారం ఈ సినిమా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
సుజీత్ ప్రభాస్ తో సాహో తర్వాత పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాను కేవలం పాటలు లేకుండా గంటన్నర నిడివితో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ కేటాయించి అన్ని హంగులతో ఈ సినిమాను ప్లాన్ చేసారట దర్శకనిర్మాతలు.
అజ్ఞాతవాసి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వకీల్ సాబ్, భీమ్లానాయక్ రూపంలో మళ్ళీ సెట్స్ మీదకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. లైన్‌లో బడా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ సెట్స్ మీద బిజీ బిజీగా గడుపుతున్నారు పవన్. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాక సంబంధించిన షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. మార్చి 31న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ సినిమా మరే సినిమాకు రీమేక్ కాదని సమాచారం. ఓ ఫ్రెష్ సబ్జెక్ట్‌తో పవన్ కళ్యాణ్ సినిమా ప్లాన్ చేశారట సుజీత్. దీంతో ఈ కొత్త సినిమా ప్రకటనతోనే మెగా అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ప్రకాష్ రాజ్, రక్షిత్ శెట్టి, టబు, అనుపమ్ ఖేర్ వంటి భారీ కాస్టింగ్‌ని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం లోని ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్ర లాంచింగ్ ఈవెంట్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20