“ఇదెక్కడి దరిద్రం రా?” అంటూ… “లక్నో” పై RCB ఓడిపోవడంతో ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్..!

“ఇదెక్కడి దరిద్రం రా?” అంటూ… “లక్నో” పై RCB ఓడిపోవడంతో ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్..!

by kavitha

Ads

ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా సోమవారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సొంతగడ్డ పైన ఊహించని విధంగా రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఓటమి ఎదురైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 212 పరుగులు చేసినప్పటికీ ఓటమి తప్పలేదు.

Video Advertisement

213 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ మొదలు పెట్టిన లక్నోకి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కైల్ మేయర్స్ డకౌటయ్యాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ 18 పరుగులు, దీపక్ హుడా (9), కృనాల్ పాండ్య పరుగులు చేయకుండానే వరుసగా ఔటైపోయారు. ఇక మ్యాచ్ బెంగళూరు చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అనిపించింది. అయితే 5వ స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన మార్కస్ స్టాయినిస్ 6 ఫోర్లు, 5 సిక్సర్లతో భారీ షాట్లు కొట్టి 65 పరుగులు చేసి లక్నో జట్టు గెలుపుకి బాటలు వేశాడు.
LSG-won-RCB-2 ఇక 6వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన నికోలస్ పూరన్ తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. అయితే 15 బంతుల్లోనే యాబై పరుగులు చేసిన పూరన్ జట్టు స్కోరు 189 దగ్గర ఉన్న సమయంలో సిక్స్ కొట్టబోయి ఔటైపోయాడు. చివర్లో పూరన్‌ ఔటయ్యాక లక్నో జట్టులో అలజడి మొదలైంది. అయితే బదోని అద్భుతమైన షాట్లతో 30 పరుగులు చేసి లక్నో జట్టును గెలుపు వైపుగా నడిపించాడు. అయితే ఇక్కడే సస్పెన్స్ చోటు చేసుకుంది. 19వ ఓవర్‌ లో 4వ బాల్ కి పార్నెల్‌ బౌలింగ్‌లో బ్యాట్స్ మెన్ బదోని సిక్సర్‌ కొట్టి, హిట్‌ వికెట్‌గా ఔట్ అయ్యాడు.
బదోని ఔట్ అవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. లక్నో జట్టు గెలుస్తుందా అనే సందేహం అందరిలోనూ మొదలైంది. కానీ చివరి బంతికి బై రావడంవల్ల లక్నో జట్టు విజయం సాధించింది. ఒక వికెట్‌ తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
LSG-won-RCB3 అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఓపెనర్లు విరాట్ కోహ్లీ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో భారీ షాట్లు కొట్టి 61 పరుగులు, డుప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 నాటౌట్ గా నిలిచాడు. 3వ స్థానంలో వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ (: 29 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లతో 59పరుగులు చేశాడు.
ఇద్దరు వేగంగా హాఫ్ సెంచరీలు చేశారు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది. లక్నో జట్టు బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్‌వుడ్ చెరో వికెట్ తీశారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ పై మరియు లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు పై నెట్టింట్లో మీమ్స్ షికారు చేస్తున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
1.2.
3.
4.5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14.15.
16.
17. 18. 19. 20.Also Read: “ఈ సారి కూడా కప్ మనదే..!” అంటూ… CSK VS LSG మ్యాచ్ లో చెన్నై గెలవడంపై 15 మీమ్స్..!

 


End of Article

You may also like