ఐపీఎల్ 16 వ సీజన్ లో భాగంగా చెపాక్ లో జరిగిన సెకండ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పన్నెండు పరుగులతో తేడాతో లక్నో జట్టు పై విజయం సాధించింది. ఈ సీజన్ లో బోణి కొట్టి ధోని సేన తమ సక్సెస్ ఖాతాను తెరిచింది. టాస్ ఓడి చెన్నై ముందుగా బ్యాటింగ్ చేసి, 217 పరుగులు చేసింది.
Video Advertisement
లక్నో జట్టు 218 రన్స్ లక్ష్యంతో ఆడగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల కోల్పోయి, 205 రన్స్ చేసి, 12 రన్స్ తేడాతో ఓటమి పాలయ్యింది. ఇక ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా చెన్నై బౌలర్ మోయిన్ అలీ నిలిచాడు. సొంత గ్రౌండ్‌లో చెన్నై జట్టుకి ఇది 19వ గెలిపు. 3 సార్లు ఓడిపోయింది.
ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో రుతురాజ్- 57, డెవాన్ కాన్వే -47 రన్స్ చేయడంతో 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. తరువాత బరిలోకి దిగిన లక్నో బ్యాటింగ్ మొదలుపెట్టింది. కానీ వరుసగా వికెట్లు కోల్పోయింది. కైల్ మేయర్స్ – 53, నికోలస్ పూరన్ -32 ధాటిగా ఆడినప్పటికి తరువాత వచ్చిన బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు.
చివర్లో ఆయుష్ బదోని-23 ), కృష్ణప్ప గౌతమ్-17 నాటౌట్, మార్క్ వుడ్ – 10, పోరాడినా గెలుపుకు 12 రన్స్ దూరంలో ఆగిపోయింది. కేఎల్ రాహుల్-20, స్టాయినిస్-21 రన్స్ చేశారు. చెన్నై జట్టు బౌలర్లలో మొయిన్ అలీ 26 పరుగులు ఇచ్చి, 4 వికెట్లు తీసి లక్నో జట్టును కట్టడి చేశారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ పై మరియు ధ్వనిశెన విజయం పై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ షికారు చేస్తున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
1.2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13
14.
15.
16.
17.
18.
Also Read: “ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ..!” అంటూ… IPL 2023 స్టార్ట్ అవ్వడంపై 15 మీమ్స్..!