ఐపీఎల్ కోసం క్రికెట్ ప్రేక్షకులందరూ ఏ రేంజ్ లో ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే చాలు సాధారణంగానే టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షించే ప్రేక్షకులు.. ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడుతూ రావడంతో అభిమానులందరికీ నిరాశే ఎదురైంది.
Video Advertisement
ఇక అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7:30 గంటలకి డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ టీమ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌కి ముందు ఐపీఎల్ 2023 ఆరంభోత్సవాన్ని స్టేడియంలో నిర్వహించబోతున్నారు. 2018 తర్వాత నాలుగేళ్ళ తర్వాత ఐపీఎల్ ఆరంభోత్సవం జరగబోతోంది.
ఐపీఎల్ 2019 సీజన్‌కి ముందు కూడా ఆరంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. కానీ.. పుల్వామా దాడిలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఆరంభోత్సవాన్ని రద్దు చేసి.. ఆ ఖర్చుని సైనికుల ఫ్యామిలీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అందించింది. ఆ తర్వాత 2020 నుంచి 2022 వరకు కరోనా కారణంగా ఆరంభోత్సవాలు జరగలేదు. ఇక ఈ ఈవెంట్‌లో పాన్ ఇండియా హీరోయిన్స్ రష్మిక మందన, తమన్నా భాటియా డ్యాన్స్ చేయబోతున్నారు. అలానే పాపులర్ సింగర్ అరిజిత్ సింగ్ లైవ్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోటీపడనుండగా.. ఈ రోజు నుంచి మే 28 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో 58 రోజుల పాటు మొత్తం 74 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈరోజు మ్యాచ్‌లో ఆడబోతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలవగా.. గుజరాత్ టైటాన్స్ గత ఏడాది తొలిసారి బరిలోకి దిగి టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే ఐపీఎల్ ప్రారంభం కావడం పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటి పై మీరు ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18