“ఇన్ని సంవత్సరాల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్..!” అంటూ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సినిమా రిలీజ్‌పై 15 మీమ్స్..!

“ఇన్ని సంవత్సరాల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్..!” అంటూ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సినిమా రిలీజ్‌పై 15 మీమ్స్..!

by Anudeep

Ads

బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కేథరిన్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. వీరితోపాటు బాబీ సింహా, సత్య రాజ్, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, శ్రీనివాసరెడ్డి ఇంకా ఎంతోమంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రం లో నటిస్తున్నారు.

Video Advertisement

అయితే చిరంజీవిని పక్కా మాస్ లుక్ తో చూడాలని కొంతకాలం నుంచి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం లో చిరు ని అలాగే చూపించబోతున్నాడు దర్శకుడు బాబీ. ‘వాల్తేరు వీరయ్య’.. సముద్రం నేపథ్యంలో .. జాలరి గూడెం బతుకుల చుట్టూ తిరిగే కథ. ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. వాల్తేరు వీరయ్యకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. సెన్సార్ వాళ్ల టాక్ బట్టి ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్‌గా చిరు అభిమానులు పండగ చేసుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.

memes on chiru waltair veerayya movie release..
మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 13 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ నెట్టింట్లో హల్‌ చల్ చేస్తోంది. చిరంజీవి మాస్‌ అవతార్‌లో అందరినీ ఎంటర్‌టైన్‌ చేయనున్నట్టు ఇప్పటికే చెప్పేశాడు డైరెక్టర్‌. ఆ ట్రైలర్ ని చూస్తుంటే వింటేజ్ చిరు ని చూసినట్టుంది ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో వాల్తేరు వీరయ్య చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది టీం. ఇప్పటికే విడుదలైన పాటలు.. వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

memes on chiru waltair veerayya movie release..

మాస్ కమర్షియల్ అంశాలు ఫుల్లుగా ఉండేలా ఈ వాల్తేరు వీరయ్య కథ రాసుకున్నారట డైరెక్టర్ బాబీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారట. అలాగే ఈ మూవీలో చిరంజీవి- రవితేజ మాస్ సాంగ్ ‘పూనకాలు లోడింగ్’ కూడా ఇప్పటికే విడుదల అయ్యింది. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేములో స్టెప్పులేయబోతున్నారట. ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ హైలైట్ కానున్నాయని సమాచారం. చిరంజీవి, రవితేజ ఊరమాస్ స్టెప్స్ థియేటర్లలో ఆడియన్స్ చేత గోల పెట్టిస్తామని చెబుతున్నారు మేకర్స్. అయితే వాల్తేరు వీరయ్య రిలీజ్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18


End of Article

You may also like