మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. చిరు తాజా చిత్రం వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Video Advertisement

మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 13 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ టీజర్‌ నెట్టింట్లో హల్‌ చల్ చేస్తోంది. చిరంజీవి మాస్‌ అవతార్‌లో అందరినీ ఎంటర్‌టైన్‌ చేయనున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు డైరెక్టర్‌. విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో వాల్తేరు వీరయ్య చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది టీం. ఇప్పటికే విడుదలైన పాటలు.. వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

memes on waltair veerayya trailer..!!

అయితే చిరంజీవిని పక్కా మాస్ లుక్ తో చూడాలని కొంతకాలం నుంచి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం లో చిరు ని అలాగే చూపించబోతున్నాడు దర్శకుడు బాబీ. ‘వాల్తేరు వీరయ్య’.. సముద్రం నేపథ్యంలో .. జాలరి గూడెం బతుకుల చుట్టూ తిరిగే కథ. ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. వాల్తేరు వీరయ్యకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. సెన్సార్ వాళ్ల టాక్ బట్టి ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్‌గా చిరు అభిమానులు పండగ చేసుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.

తాజా అప్‌డేట్ ప్రకారం వాల్తేరు వీరయ్య రన్‌ టైం ఎంతనేది కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం రన్‌ టైం 2 గంటల 40 నిమిషాలు. ఈ మధ్య కాలం లో ఇంత ఎక్కువ రన్ టైం ఉండటం ఈ సినిమాకే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు రవితేజ. సెకండాఫ్ లో ఇతడి పాత్ర చాలా ఎమోషనల్ గా సాగుతుందట. దీంతో మూవీ రన్ టైం పెరిగింది. అయితే శనివారం సాయంత్రం ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. దీనిపై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

#1

#2#3#4#5#6#7#8#9#10
#11#12#13#14#15#16#17#18

watch video :