అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఏజెంట్. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అయితే ఇప్పటివరకు లవర్ బాయ్‌గా అమ్మాయిల మనసు దొచుకున్న అక్కినేని వారబ్బాయి.. ఇప్పుడు మాస్ లుక్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
Video Advertisement
ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ పూర్తిగా మార్చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో.. ఉంగరాల జుట్టుతో సరికొత్తగా కనిపిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉంది. అయితే, తనకు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమని అఖిల్ అక్కినేని ఇంతకు ముందు కూడా చెప్పారు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో లాస్ట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చారు అఖిల్. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు.
దీంతో చాలా గ్యాప్ తీసుకొని ఏజెంట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు అఖిల్. గత సంవత్సరం నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాఏప్రిల్ 28 న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కోసం అఖిల్ అలుపెరగకుండా ప్రమోషన్‌లలో పాల్గొన్నాడు. కాకినాడలో పోస్టర్ లాంచ్ కోసమే 172 అడుగుల నుంచి తాళ్ల కట్టుకుని దూకాడంటే ఈ సినిమా కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో తెలుస్తుంది. అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ కి మిక్స్డ్ టాక్ వస్తోంది.
ఈ మూవీ లో అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్, పెర్ఫార్మన్స్ పై ప్రశంసలు వస్తున్నప్పటికీ ప్రస్తుతానికి ఈ మూవీ కి యావరేజ్ టాక్ వస్తోంది. ఈ మూవీ తెలుగు, మలయాళం భాషల్లో రిలీజ్ అయ్యింది. తన హీరోలను హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా స్టైలిష్‌గా చూపించడంలో సురేందర్ రెడ్డి దిట్ట. ఇప్పుడు ఏజెంట్ గ్లింప్స్ చూసినా ఆ విషయమే మరోసారి అర్థమవుతోంది. దానికి తగ్గట్టే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు సురేందర్‌రెడ్డి.
అయితే తాజాగా ఏజెంట్ మూవీ పై నెట్టింట పలు ట్రోల్స్ వస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18