తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అభిమానులంతా మాటల మాంత్రికుడు అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. త్రివిక్రమ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. డైరెక్టర్ గా మారక ముందు త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా చాలా చిత్రాలు చేసాడు. మరి కొన్ని చిత్రాలకు ఘోస్ట్ రైటర్ గా కూడా పని చేసాడు.

Video Advertisement

1999 లో స్వయంవరం చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. త్రివిక్రమ్ డైలాగ్ లు ఉంటే సినిమా హిట్ అనే నమ్మకాన్ని కలిగించారు. ఈయన సినిమాలు ఆలోచింపజేస్తాయి. ఆయన కలం తో రాసిన మాటలు తూటాల్లా మన మనసులలోకి, మెదడులోకి దూసుకుపోతాయి. చాల మంది హీరోలకి ఫాన్స్ ఉంటారు.. కానీ ఈయన మాటలకి హీరోలు ఫాన్స్. తాను చెప్పాలనుకున్నది పెద్ద పెద్ద పదాల్లో చెప్పడు త్రివిక్రమ్. సాధారణ పదాలు వాడుతూ సారాన్ని మనలోకి ఎక్కిస్తాడు.

netizens found two different dialouges from trivikram..!!

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘ స్రవంతి’ రవి కిషోర్ నిర్మించిన ‘నువ్వే నువ్వే’ చిత్రం తో త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం తరుణ్, శ్రేయ జంటగా నటించారు. అయితే ఈ చిత్రం లో తరుణ్ ప్రకాష్ రాజ్ తో ఒక మాట చెప్తాడు.. ” నా చెల్లి ఒక అనామకుడిని ప్రేమించింది అని చెప్తే.. నేను మీలాగా ఆవేశపడను. మనం ఎవర్నైనా ప్రేమిస్తే వాళ్ళ ఆలోచనలు మనకి దగ్గరగా ఉంటేనే ప్రేమిస్తాం.. అందుకే నా చెల్లి అడుక్కునే వాడిని ప్రేమిస్తే.. వాడిలో ఏదోక మంచి విషయం ఉందని నేను నమ్ముతాను.” అని రాసాడు త్రివిక్రమ్.

 

netizens found two different dialouges from trivikram..!!
కానీ కొన్నేళ్ల తర్వాత తీసిన అత్తారింటికి దారేది చిత్రం లో.. ” మీ కూతురు ఒక డ్రైవర్ ని ప్రేమించింది అంటే మీకు కోపం వచ్చింది కదా.. అలాగే మా తాత కి కూడా మా అత్త ని పెళ్లి చేసుకున్నప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చిన కోపం కరెక్ట్ అయితే.. అప్పుడు మా తాతకి వచ్చిన కోపం కూడా కరెక్ట్ ఏ.. అప్పుడు ఆయనది తప్పు అయితే.. ఇప్పుడు మీది కూడా తప్పే..” అని పవన్ కళ్యాణ్ తో పలికించాడు త్రివిక్రమ్. అయితే ఈ రెండు సినిమాల్లోని డైలాగ్ లు ఒకదానికొకటి విరుద్ధం గా ఉన్నాయి. ఏంటి గురూజీ ఆ సినిమాలో అలా చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో ఇలా చెప్పారేంటి గురూజీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.