Ads
డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి పరిచయం అక్కర్లేదు. రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. తర్వాత దర్శకుడుగా మారి సూపర్ హిట్లు తరికెక్కించి నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా వెలుగొందుతున్నారు.
Video Advertisement
త్రివిక్రమ్ డైలాగ్స్ కి ఎంతమంది ఫాన్స్ ఉన్నారో ఆయన స్పీచ్ కూడా అంతే మంది ఫాన్స్ ఉన్నారు. ఏదైనా ఫంక్షన్ లో స్టేజ్ మీద త్రివిక్రమ్ మాట్లాడుతున్నారు అంటే చప్పుడు చేయకుండా ఆయన ఏం చెప్తున్నారా అని నిశ్శబ్దంగా వింటూ ఉంటారు. ఆయన మాటలకు ఉన్న పవర్ అటువంటిది విలువ అటువంటిది.
ఎప్పుడైనా బోర్ కొట్టిన, లో ఫీలింగ్ అనిపించిన త్రివిక్రమ్ మాటలు వింటే సరిపోతుంది. ఎక్కడ లేని ఉత్సాహం తనూకు వస్తుంది. ఇప్పటికీ రైటర్ గా త్రివిక్రమ్ పనిచేసిన సినిమాలు టీవీలో వస్తున్నాయంటే పడి పడి చూస్తాం. నువ్వు నాకు నచ్చావు,మల్లీశ్వరి, చిరునవ్వుతో, జై చిరంజీవ లాంటి సినిమాల్లో త్రివిక్రమ్ డైలాగ్స్ కి క్లాప్స్ కొట్టని వారు ఉండరు.తర్వాత ఆయన దర్శకుడిగా మారి తరుణ్ తో నువ్వే కావాలి సినిమాని తెరకెక్కించారు.
తర్వాత మహేష్ బాబు తో అతడు, పవన్ కళ్యాణ్ తో జల్సా వంటి సూపర్ హిట్ సినిమాలు అతని ఖాతాలో ఉన్నాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు తెరకెక్కించారు.ఇక త్రివిక్రమ్ కుటుంబ విషయానికొస్తే ఆయన భార్య లక్ష్మి సౌజన్య ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ్ముడి కూతురు. ఆమె ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలో నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ కి ఇద్దరు కొడుకులు. తాజాగా త్రివిక్రమ్ కొడుకు ఫోటోని సిరివెన్నెల సీతారామశాస్త్రి కొడుకు రాజా చెంబోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ ఫోటోలో త్రివిక్రమ్ భార్య కూడా ఉన్నారు. త్రివిక్రమ్ కొడుకు రిషి ని చూసిన ఎవరైనా సరే అచ్చం త్రివిక్రమ్ నోట్లో నుండి ఊడిపడ్డాడు అన్నట్టు ఉన్నాడు. త్రివిక్రమ్ ఫేస్ కట్స్ తో, కళ్ళజోడుతో జిరాక్స్ కాపీలా అనిపిస్తున్నాడు అని అభిమానులు చెబుతున్నారు. త్వరలోనే త్రివిక్రంలా దర్శకుడిగా మారి సినిమాలు తెరకెక్కిస్తాడు ఏమో చూడాలి.
Also Read:“టైగర్ నాగేశ్వరరావు” మూవీ గురించి ఈ నెటిజెన్ పోస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!
End of Article