తెలుగు ప్రేక్షకులకు ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకం గా పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలు ఎంచుకుంటూ విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు ఐశ్వర్య రాజేష్. టాలీవుడ్ లో ఆమె చేసిన చిత్రాలన్నీ పరాజయం పొందినా.. ఆమెకు ఇక్కడ ఫాన్స్ ఎక్కువగానే ఉన్నారు. సినిమాల్లో గ్లామర్ షో కి దూరం గా ఉండే ఆమె సోషల్ మీడియా లో మాత్రం ట్రెండీ వేర్ తో ఉన్న ఫోటోలను పంచుకుంటుంది ఐశ్వర్య.

Video Advertisement

 

అయితే ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఫర్హానా`సినిమా ఒకటి. జనవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఈవెంట్‌లో పాల్గొంది ఐశ్వర్యా. అందులో ఆమె స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుంది. అయితే ఆ డ్రెస్ లో ఐశ్వర్య చేతులు కండలు తిరిగినట్టుగా, చూడటానికి గట్టిగా బలంగా కనిపిస్తున్నాయి. అయితే నెటిజన్స్ ఆమె హాండ్స్ ని చూసి షాక్ అవుతున్నారు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. ఆమె చేతులపై పోస్ట్ లుపెడుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. అంతే కాదు లక్ష్మి సినిమాలో వెంకటేష్ కండలతో పోలుస్తూ ఫన్నీ పోస్ట్ లు పెడుతున్నారు.

trolls on heroine aishwarya rajesh..

 

ఐశ్వర్య రాజేష్ తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్, టాక్ జగదీశ్, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే తెలుగులో ఆమెను విజయాలు వరించక పోయినా కోలీవుడ్‌లో మాత్రం ఫుల్‌ బిజీగా ఉంది. టాలీవుడ్‌లో ఆమె చేసిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. అలాగే ఓటీటీల్లో కూడా ‘సూడల్’ అనే వెబ్ సిరీస్ తో అడుగు పెట్టింది ఐశ్వర్య రాజేష్.

కాగా ఎలాంటి రోల్స్ అయినా అవలీలగా నటించే ఐశ్వర్య రాజేష్ కి స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందట్లేదు. కమర్షియల్‌ హీరోయిన్‌గా ఈ బ్యూటీకి ఆఫర్స్ రావడం లేదు. కానీ ఆమె వరుస చిత్రాలతో అదరగొడుతోంది. ఐశ్వర్య రాజేష్‌ ప్రస్తుతం తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళంలో ఆమె ఎనిమిది సినిమాలు, మలయాళంలో మూడు సినిమాలు చేస్తుంది. మొత్తంగా డజన్‌ సినిమాలు ఆమె చేతిలో ఉండటం విశేషం.