“చంద్రముఖి 2” లో ఇది ఇంతలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?

“చంద్రముఖి 2” లో ఇది ఇంతలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?

by Mohana Priya

Ads

రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్, ఆ తరువాత నటుడుగా, హీరోగా, డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. హర్రర్ కామెడీ చిత్రాలను తెరకెక్కిస్తూ  అటు తమిళ ఆడియెన్స్ ను ఇటు తెలుగు ఆడియెన్స్ అలరిస్తున్నాడు.

Video Advertisement

లారెన్స్ ప్రస్తుతం 18 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి మూవీకి సీక్వెల్ గా వస్తున్న ‘చంద్రముఖి 2’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి పి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కంగనా రౌనత్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ ను ట్రోల్ చేస్తూ చేసిన మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సూపర్‌స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన ‘చంద్రముఖి’ సినిమా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అప్పట్లో ఈ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను  అందించింది. ఆయన కెరీర్ లో మరపురాని చిత్రాలలో చంద్రముఖి మూవీ ఒకటి.
ఈ మూవీని మరోసారి చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. ఈ సినిమాకి డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి దాదాపు 18 సంవత్సరాల తర్వాత అదే దర్శకుడు సీక్వెల్ ను తీస్తున్నారు. ఇందులో లారెన్స్ హీరోగా, చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న చంద్రముఖి 2 మూవీని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం నాడు ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్ పై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్ లో వెంకటపతి రాజు గెటప్‌లో లారెన్స్ కనిపించారు. పోస్టర్ లో లారెన్స్ తల పెద్దగా, బాడీ చిన్నగా, ఉండటంతో ఈ పోస్టర్ పై ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read: “ఇంటర్వెల్, క్లైమాక్స్ మార్చేశారు..!” అంటూ… “విజయ్” సినిమాపై రాజమౌళి పోస్ట్ చూశారా..?


End of Article

You may also like