గతకొంత కాలంగా చట్టా పట్టాలేసుకుని మీడియా కంట పడుతున్న మంచు మనోజ్‌, భూమా మౌనికలు శుక్రవారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి మంచు లక్ష్మీ ఇల్లు వేదికైంది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతూ ఉన్నాయి. ఇక మనోజ్‌కు గతంలో ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. కాగా నాలుగేళ్ల తర్వాత పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక భూమా మౌనిక రెడ్డి కూడా గతంలో గణేష్‌ రెడ్డి అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ వీరిద్ధరూ కొన్నాళ్లకే విడిపోయారు.

Video Advertisement

 

 

అయితే తాజాగా ఆయన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంచు మనోజ్. నాలుగేళ్ల ప్రేమ ఫలించి భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని నటుడు మంచు మనోజ్‌ అన్నారు. “జీవితంలో ఏ విషయంలోనైనా ఓడిపోవచ్చు. కానీ, ప్రేమలో గెలవాలి. ఇది నేను ఎప్పుడూ నమ్మే సూత్రం. ఎందుకంటే ఇప్పుడు నా విషయంలో ప్రేమే గెలిచింది. 12 ఏళ్లగా మౌనిక నాకు తెలుసు. నాలుగేళ్ల క్రితం నేను జీవితం లో చాలా కోల్పోయి బాధలో ఉన్నప్పుడు మౌనిక నాకు సపోర్ట్‌గా నిలిచింది. అలా, మేమిద్దరం మరింత దగ్గరయ్యాం.. ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలబడ్డాం. దేవుడి దయ వల్ల అందరూ కలిసి మా పెళ్లి చేశారు. దైరవ్‌ నా జీవితంలోకి రావడం కూడా శివుడి ఆజ్ఞగా భావిస్తా.” అని మనోజ్ అన్నారు.

true love proved by manchu manoj..

అయితే ఈ వివాహం చేసుకోవడం పై మనోజ్ పై మొదట్లో చాలా కామెంట్స్ వచ్చాయి. పెళ్లి అయ్యి ఒక బాబు ఉన్న అమ్మాయిని చేసుకోవడం కూడా మంచు ఫ్యామిలీ కి ఇష్టం లేదంటూ వార్తలు కూడా వచ్చాయి. గతం లో సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి లోని ఓ వినాయక మండపానికి వీరిద్దరూ కలిసి వచ్చినప్పటి నుంచి వీరి బంధం పై ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ మనోజ్ వాటన్నిటిని ఎదుర్కొని.. తమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చాడు.

true love proved by manchu manoj..

ప్రస్తుతం మనం ఉన్న సమాజం లో ఒక అమ్మాయి రెండో వివాహం చేసుకోవడాన్ని చాలా మంది సమర్థించరు. కానీ మనోజ్ ఎంతో ధైర్యం గా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటూ.. తన భార్యను ఆమె మొదటి భర్త కుమారుడ్ని కూడా పూర్తిగా అతడి జీవితంలోకి స్వాగతించాడు. తిరుపతి లో కూడా తన భార్య బిడ్డ గురించి మాట్లాడుతూ.. ధైరవ్ రెడ్డిని తన కొడుకుగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్న‌ట్లు మంచు మ‌నోజ్ చెప్ప‌క‌నే చెప్పేశాడు. దీంతో ఆయ‌న మంచి మ‌న‌సుకు నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుత కాలం లో ఇటువంటి మంచి మనసు ఉన్న వారు అరుదుగా ఉంటారు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక వారిద్దరి జంట ఆనందం గా ఉండాలని అందరు కోరుకుంటున్నారు.