ఇద్దరు కొడుకులు ఉన్నవారు… ఒక కొడుకు ఉన్నవారికి గాజులు ఇవ్వాలా..? ఈ వార్తలో ఉన్న నిజం ఎంత..?

ఇద్దరు కొడుకులు ఉన్నవారు… ఒక కొడుకు ఉన్నవారికి గాజులు ఇవ్వాలా..? ఈ వార్తలో ఉన్న నిజం ఎంత..?

by Mounika Singaluri

Ads

సోషల్ మీడియా అనేది మంచికి, చెడుకి రెండిటికి ఒక మీడియం అయిపోయింది. ఏదైనా ఒక విషయాన్ని ప్రపంచంలో ఎంత దూరం అయినా సరే విస్తరింప చేయగల శక్తి సోషల్ మీడియాకి ఉంది. అవి నిజాలు అయితే పదిమందికి ఈ విషయం తెలిస్తే మంచి జరుగుతుంది. లేదు అవి నిజాలు కాకపోతే అందరికీ తెలియడం అనేది కరెక్ట్ కాదు.

Video Advertisement

సోషల్ మీడియాలో కొన్ని వదంతులు సృష్టించి వాటిని బాగా వైరల్ చేయడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. ముఖ్యంగా మూఢనమ్మకాలను బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక వదంతే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

2024 సంక్రాంతి కీడు వచ్చిందని ఈ సంక్రాంతికి ముత్తైదువులు ఇద్దరు కొడుకులు ఉన్నవారు ఒక కొడుకున్న వారికి గాజులు కొన్ని ఇవ్వాలని వార్తలు బాగా వైరల్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ, ఈ విషయం మాత్రం గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఒక పాయింట్ తర్వాత ఈ విషయం నిజం అని నమ్మడం మొదలుపెట్టారు కూడా. అసలు ఈ వార్త ఎక్కడ నుండి మొదలు అయ్యింది అనేది తెలియదు. కానీ ప్రచారంలోకి మాత్రం వచ్చింది. ఇందులో నిజం ఎంత ఉంది అనేది కూడా తెలియదు.

అయితే దీనిపైన వేద పండితులు స్పందించారు… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు. శాస్త్ర ప్రమాణం కాకుండా ఇటువంటివి చేయకూడదని అన్నారు. ఈ సంక్రాంతికి ఎటువంటి కీడు లేదని ఎవరో ఎక్కడో ఒకచోట సృష్టించిన దాన్ని పట్టుకుని అందరూ నిజమైన నమ్మడం మంచిది కాదని అన్నారు. ఒకవేళ నిజంగా గాజులు కొనివ్వాలనుకుంటే కొనివ్వచ్చు తప్ప ఈ మూఢ నమ్మకాలను ఆధారంగా చేసుకుని కొనివ్వడం అనేది సరైన పద్ధతి కాదని చెబుతున్నారు.

bangles

పండుగలకు కీడు రావడం గాజులు కొనివ్వడం అన్నదానికి ఎటువంటి సంబంధం లేదని ఏదైనా అటువంటిది ఉంటే వేద పండితులు స్పష్టమైన వివరణ ఇస్తారని వాటిని మాత్రమే నమ్మాలని తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఉట్టి పుకారు మాత్రమే అని తేలిపోయింది.


End of Article

You may also like