“మీలో ఎవరు కోటీశ్వరుడు” షో లో నిజంగానే డబ్బులు ఇస్తారా..? దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే..?

“మీలో ఎవరు కోటీశ్వరుడు” షో లో నిజంగానే డబ్బులు ఇస్తారా..? దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే..?

by kavitha

Ads

గత కొన్నేళ్లుగా బుల్లితెర పై మనీ గెలుచుకునే అవకాశం ఉన్న గేమ్ షోల సందడి ఎక్కువైందని చెప్పవచ్చు. ఈ షోలలో పాల్గొనడం ద్వారా సామాన్య ప్రజలు కూడా డబ్బును గెలుచుకోవచ్చు. ఇది ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ టీవి షోతో ప్రారంభమైంది.

Video Advertisement

దీనిలో పాల్గొనే పోటీదారులు ఎక్కువ మొత్తంలో డబ్బును గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది ఈ షోలో పాల్గొని డబ్బును గెలుచుకున్నారు. అయితే ఈ డబ్బును నిజంగానే గెలిచినవారికి ఇస్తారా? ఎవరు ఆ డబ్బును ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో ఇలాంటి గేమ్ షోలు ఇండియాలో ఎక్కువగానే ప్రసారం అవుతున్నాయి. అనేక టీవి ఛానెల్స్  ఇలాంటి గేమ్ షోలను ప్రారంభించాయి. ఈ షోలలో పాల్గొని, గెలవడం ద్వారా డబ్బును గెలుచుకోవచ్చు. బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ 2000లో ప్రారంభించిన “కౌన్ బనేగా కరోడ్ పతి” టీవీ షోకు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అదే షోని తెలుగులో “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో  2014 నుంచి మాటీవీలో ప్రారంభం అయ్యింది. తెలుగులో కూడా ఈ షో సక్సెస్ అయ్యింది.
తొలి 3 సీజన్లకి నాగార్జున హోస్ట్, 4వ సీజన్‌కి మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేశారు. 5 వ సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్‌ హోస్ట్ గా అలరించారు. అయితే ఐదో సీజన్‌ జెమిని టీవిలో ప్రసారం అయ్యింది. ఈ షో పేరును “ఎవరు మీలో కోటీశ్వరులు” గా మార్చారు. ఈ షోలలో ఇప్పటివరకు చాలా మంది ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. అయితే ఈ షోలలో మనీని గెలుచుకున్న పోటీదారులకు మనీని నిజంగానే ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఆ మనీని ఎవరు ఇస్తారనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. షోలో గెలిచినవారికి వారికి ఆ షో నిర్మాత డబ్బును ఇస్తారు.
సినిమాలకు ప్రొడ్యూసర్స్ ఎలా ఇస్తారో అలాగే షోను హోస్ట్ చేసిన వ్యక్తికి, అలాగే గెలిచిన కంటెస్టెంట్ కి కూడా నిర్మాతనే డబ్బును ఇస్తారు. ఈ షో మధ్యలో వచ్చే ప్రకటనల ద్వారా నిర్మాతలకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది. ఈ షో రాత్రి పూట మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. ఏ భాషలో అయినా సరే ఈ షో రాత్రి పూట వస్తుంది. అందుకు కారణం ఏంటంటే ఆ సమయంలో టిఆర్పి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో టిఆర్పి ఎక్కువగా ఉంటే యాడ్స్ కూడా ఎక్కువగా వస్తాయి.

Actors who turned into hosts

దాని ద్వారా నిర్మాతలకి చాలా డబ్బులు వస్తాయి. అసలు ఎక్కువ డబ్బులు ఇలాగే యాడ్స్ ద్వారానే వస్తాయి. అలా వచ్చిన డబ్బు నుండి ప్రైజ్ మనీగా ఇస్తారు. ఒక్క యాడ్స్ నుండే కాకుండా ఎస్ ఎంఎస్ కాంటెస్ట్ ద్వారా కూడా షో ప్రొడ్యూసర్స్ కి డబ్బులు వస్తాయి. అలా గెలిచిన వారికి డబ్బుని షో ప్రొడ్యూసర్స్ ఇస్తారు.

Also Read: ప్రభాస్ “ఆదిపురుష్” ట్రైలర్‌లో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?


End of Article

You may also like