అపెక్స్ విద్యా వికాస్: జంట నగరాలలోని విద్యార్థిని-విద్యార్థులకు గొప్ప సదవకాశం… తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ వారి ప్రత్యేక పథకం.!

అపెక్స్ విద్యా వికాస్: జంట నగరాలలోని విద్యార్థిని-విద్యార్థులకు గొప్ప సదవకాశం… తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ వారి ప్రత్యేక పథకం.!

by Sainath Gopi

సాధారణంగా విద్యా రుణాలు అంటే ఉన్నత చదువులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు తాకట్టు ఏదో ఒకటి ఉంటే కాని రుణం మంజూరు అవదు. ఇలాంటి పరిస్థితుల్లో పేద/మధ్య తరగతి కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకుని, వాళ్ళ పిల్లల చదువుల కోసం వారు పడే ఇబ్బందులను గమనించి తెలంగాణా రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు వారు కేవలం ఉన్నత చదువులకు మాత్రమే కాకుండా హైస్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా రుణాలు అందించాలని గొప్ప సంకల్పంతో నూతన పథకంను ప్రారంభించారు. అంతేకాకుండా విద్యార్థినులకు వడ్డీరేటులో 0.5% రాయితీ కూడా ఇస్తున్నారు.

Video Advertisement

హైస్కూల్ విద్యకి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గరిష్ఠంగా రూ.2.50 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తూ
ఇంటర్మీడియట్/ఇతర సమాన కోర్సులకు గరిష్ఠంగా రూ.5.00 లక్షల వరకు టర్మ్ లోన్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. చదువు మీద ఆసక్తి ఉండి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే చాలా మంది మధ్యతరగతి విద్యార్థులకు, పిల్లలకి నాణ్యమైన చదువుని అందించాలని కోరుకునే తల్లిదండ్రులకు ఇదొక ఆశాదీపంగా మారుతుందని భావిద్దాo.

మరిన్ని వివరాలకు మీ సమీప బ్రాంచిని గానీ లేక 040-24685509 నెంబర్ ను సంప్రదించవచ్చు.


You may also like