యంగ్ హీరోలకు పోటీగా నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల అఖండ సక్సెస్ తో రికార్డులు తిరగ రాసిన బాలయ్య. ఇప్పుడు మరో మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకుడిగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీరసింహ రెడ్డి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. శృతి హాసన్ కథానాయిక.

Video Advertisement

బాలయ్య 107 చిత్రం గా రాబోతున్న ‘వీర సింహ రెడ్డి’ లో హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచే ఫాన్స్ ఈ చిత్రం పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోలు ఈ వీర సింహా రెడ్డిపై హైప్ పెంచేశాయి. అంతే కాకుండా క్రాక్, అఖండ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బాలయ్య- గోపీచంద్ చేస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి.

memes on veera simha reddy song..

అయితే ఈ చిత్రం గురించి నెట్టింట ఒక అప్డేట్ వైరల్ అవుతోంది. మాస్ ఎంటర్టైనర్ అయిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేట‌ర్ల‌కు వ‌స్తారు కాబట్టి… సెంటిమెంట్ సన్నివేశాలు వారిని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. దానికి తగ్గట్టుగా ఈ చిత్రం లో వరలక్ష్మి బాలయ్య చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దాంతో పాటు సినిమా మొత్తం మీద ఒక ట్విస్ట్ కూడా హైలైట్ గా ఉంటుందట. ఆ ట్విస్ట్ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని చిత్ర బృదం కంగారు పడుతోందని సమాచారం.

 

varalakshmi sarath kumar role in veerasimha reddy..
మరోవైపు వరుస అప్ డేట్స్ తో ఫాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘జై బాలయ్య’, ‘సుగుణ సుందరి’, ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ పాటలు విడుదల చేయగా అవి ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. తమన్ బాణీలకు, శృతి హాసన్ తో స్టెప్పులు వేస్తూ బాలయ్య ఫుల్ ఎనర్జీ తో కనిపిస్తున్నారు.