ప్రతి ఏడాది బిగ్ బాస్ సీజన్ అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. గత ఏడాది మాత్రం కరోనా కారణం గా ఈ సీజన్ ఆలస్యం గా మొదలైయింది. కరోనా కారణం గా పలు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఈ సీజన్ ను షూట్ చేసారు. తాజాగా.. ఈ ఏడాది కూడా ఈ షో ను టెలికాస్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

big boss

ఈ క్రమం లో బిగ్ బాస్ సీజన్ 5 లో ఉండబోయే కంటెస్టెంట్ల గురించి కూడా వార్తలు హల్ చల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ ల లిస్ట్ కూడా వైరల్ కూడా అయింది. సెప్టెంబర్‌ 5న సాయంత్రం 6 గంటల సమయం లో బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమం లోనే కంటెస్టెంట్ లను హైదరాబాద్ లోనే ఓ హోటల్ లో క్వారంటైన్ చేసారని సమాచారం. అయితే.. వీరిలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా తేలిందట. పేర్లు బయటకు రాలేదు. ఈ క్రమం లో ఈ కార్యక్రమం అనుకున్న విధంగానే టెలికాస్ట్ అవుతుందా..? లేక పోస్ట్ పోన్ అవుతుందా? అన్న చర్చలు మొదలయ్యాయి.