ఇద్దరు యువతులు కాలేజీలో కొట్టుకున్నారు. అది కూడా నార్మల్ గా కాదండోయ్.. ఏకంగా జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరినీ ఆపాల్సిందే పోయి సెల్ ఫోన్స్ లో ఆ ఫైటింగ్ ని రికార్డు చేశారు. పైగా విజిల్స్ వేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కూడా. అయితే ఈ యువతులు కొట్టుకోవడానికి గల కారణం ప్రేమ వ్యవహారమో లేదు అంటే అబ్బాయి వల్లనో కాదు.

Video Advertisement

నిజానికి ఆ కారణం చూస్తే ఎవరైనా నవ్వుకుంటారు. అంత చిన్న రీజన్ కి ఏకంగా ఇంత ఘోరంగా కొట్టుకోవడం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. వీళ్ళ గొడవకి గల కారణం చూడడానికి చిన్నదే అయినా ఎంతో గట్టిగా కొట్టుకున్నారు. పైగా అంతే గట్టిగ రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… మహారాష్ట్ర నాసిక్ లోని ఒక కాలేజీ లో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇద్దరూ యువతులు కాలేజీ ఆవరణలో కొట్టుకున్నారు. ఆ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. స్నేహితురాలకి ఇచ్చిన డ్రెస్ ని పాడు చేయడం వల్లనే ఒక అమ్మాయి మరొక అమ్మాయి పై మండి పడింది.

ఏకంగా తన డ్రెస్ ని పాడు చేసిందన్న కోపం తో ఫైటింగ్ మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ కావడం వలన కాలేజీ యాజమాన్యం కూడా దీనిపై స్పందించింది. ఇద్దరమ్మాయిల కి వార్నింగ్ కూడా కాలేజీ యాజమాన్యం ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ నవ్వుతూ విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. నిజమైన ఫ్రీ స్టైల్ ఫైట్ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.