ఒకేరోజు..ఒకే స్టోరీ తో రిలీజ్ అయిన రెండు తెలుగు సినిమాలు.. ఒకటి సూపర్ హిట్ అయితే ఒకటి డిజాస్టర్.. అవేంటంటే..?

ఒకేరోజు..ఒకే స్టోరీ తో రిలీజ్ అయిన రెండు తెలుగు సినిమాలు.. ఒకటి సూపర్ హిట్ అయితే ఒకటి డిజాస్టర్.. అవేంటంటే..?

by Anudeep

కొన్నిసార్లు కొన్ని సంఘటనలు చాలా యాదృచ్ఛికం గా జరుగుతుంటాయి. అవి మనకి ఎంతగానో ఆశ్చర్యం కలిగిస్తాయి. సినిమా ఇండస్ట్రీ లో కూడా ఇలాంటివి కోకొల్లలు. ఒక పాటను పోలి మరో పాట. ఒక సీన్ ను పోలి మరో సినిమా లో సీన్ ఇలా ఉండడం కొన్ని సార్లు అనుకోకుండా జరుగుతుంది. కానీ, కొన్నిసార్లు ఒకే రోజున రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి..

Video Advertisement

venky 2

ఇది కూడా అప్పుడప్పుడు జరుగుతున్నదే అయినా..ఆ రెండు సినిమాలది ఒకే స్టోరీ అయితే..? వాటిల్లోనూ ఒకటి హిట్ అయి మరొకటి ఫట్ అయితే..? ఇది గతం లోనే ఓ సారి జరిగింది. అప్పట్లో బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వంటి హీరో లు ఫుల్ ఫామ్ లో ఉండేవారు. ఆ టైం లో ఏడాది లో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేసేస్తూ ఉండేవారు. దీనితో ఒకేసారి, ఒకేరోజు రెండు సినిమా లు రిలీజ్ అయిన సందర్భాలు కూడా చాలా నే ఉన్నాయి.

venkey

అయితే, 1989 వ సంవత్సరం లో బాలకృష్ణ “ముద్దుల మావయ్య” సూపర్ హిట్ అవ్వడం తో ఫుల్ జోష్ పైన ఉన్నారు. అదే జోష్ లో “అశోక్ చక్రవర్తి” సినిమా లో కూడా నటించారు. మోహన్ లాల్ నటించిన మలయాళం సినిమా ఆర్యన్ అక్కడ పెద్ద హిట్ అయింది. అదే సినిమా ను రీమేక్ చేస్తూ అశోక్ చక్రవర్తిని తీశారు. అదే రోజు, అదే స్టోరీ తో రిలీజ్ అయిన వెంకటేష్ “ధ్రువ నక్షత్రం” మంచి టాక్ తెచ్చుకుంది. అయితే, అశోక్ చక్రవర్తి మాత్రం అంత గా ఆడలేదు.

balakrishna

మరో ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే.. రెండు సినిమాలకు రైటర్స్ పరుచూరి బ్రదర్స్. ఈ రెండు మూవీస్ స్టోరీస్ ఒక్కటే అని తెలిసినా.. ముందు గా చెప్పకుండా.. సీక్రెట్ గా ఉంచడం పై అశోక్ చక్రవర్తి సినిమా దర్శక నిర్మాతలు అసహనం వ్యక్తం చేసారు. ఈ మేరకు వారొక పేపర్ స్టేట్మెంట్ ని కూడా ఇవ్వడం ఆరోజుల్లోనే సంచలనం రేపింది.


You may also like