ఈ 11 రకాల “ట్రైన్ హారన్స్” గురించి మీకు తెలుసా.? ఏ సందర్భంలో ఏ హారన్ సైగలు చేస్తారు.?

ఈ 11 రకాల “ట్రైన్ హారన్స్” గురించి మీకు తెలుసా.? ఏ సందర్భంలో ఏ హారన్ సైగలు చేస్తారు.?

by Mohana Priya

Ads

వాహనాలు వెళ్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగితే చేసే మొదటి పని హార్న్ వేయడం. రోడ్డు మీద తిరిగే వాహనాలు మాత్రమే కాకుండా ట్రైన్ హార్న్ కూడా మనం వింటూనే ఉంటాం. ట్రైన్ హార్న్ లలో ఒక్కొక్క రకమైన హార్న్ కి ఒక్కొక్క అర్ధం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

#1 ఒక షార్ట్ హార్న్

ఒక షాట్ హార్న్ మోగినప్పుడు ట్రైన్ డ్రైవర్ అంటే లోకోమోటివ్ పైలట్ ట్రైన్ ని కడగడానికి ఇంకా శుభ్రపరచడానికి యార్డ్ కి తీసుకెళ్తున్నారు అని అర్థం.

#2 రెండు షార్ట్ హార్న్స్

ట్రైన్ మొదలుపెట్టే ముందు గార్డ్ సిగ్నల్ కోసం లోకోమోటివ్ పైలట్ రెండు షార్ట్ హార్న్స్ వేస్తారు.

#3 ఒక లాంగ్ హార్న్

ఇది క్లియర్ సిగ్నల్ అందిన తర్వాత ట్రైన్ ఒక స్టేషన్ నుండి ఇంకో స్టేషన్ కి బయలుదేరడాన్ని సూచిస్తుంది.

#4 ఒక లాంగ్ హార్న్, ఒక షార్ట్ హార్న్

ఇలా రెండు హార్న్స్ వేస్తే, గార్డ్ బ్రేక్స్ రిలీజ్ చేసి, ట్రైన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ లైన్ క్లియర్ గా ఉంది అని చెప్తున్నట్టు అర్థం.

#5 రెండు లాంగ్ హార్న్స్ తర్వాత రెండు షార్ట్ హార్న్స్

ఇంజన్ దగ్గరికి గార్డ్ ని రమ్మని పిలవడానికి ఇలా రెండు లాంగ్ హార్న్స్ తర్వాత రెండు షార్ట్ హార్న్స్ వేస్తారు.

#6 రెండు షార్ట్ హార్న్స్ తర్వాత ఒక లాంగ్ హార్న్

ఇది అలారం చైన్ లాగినప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ ప్రెజర్ లేదా వాక్యూమ్ కోల్పోవడాన్ని సూచిస్తుంది.

#7 మూడు షార్ట్ హార్న్స్

ట్రైన్ కంట్రోల్ లో లేదు అని, అసిస్ట్ చేయడానికి లేదా బ్రేక్స్ వేయడానికి గార్డ్ అవసరం అని సూచిస్తుంది.

#8 నాలుగు షార్ట్ హార్న్స్

ఇది యాక్సిడెంట్ వల్ల కానీ, ఫెయిల్యూర్ వల్ల కానీ లేదా ఇంకేదైనా కారణం వల్ల కానీ ట్రైన్ ముందుకు సాగలేదు అని సూచిస్తుంది.

#9 ఒక చాలా లాంగ్ హార్న్

ఇది ట్రైన్ ఒక లెవల్ క్రాసింగ్ లేదా టన్నెల్ ఏరియాకి చేరుకున్నప్పుడు, రేర్ ఎండ్ లో ట్రైన్ కి భద్రతగా ఉన్న సిబ్బందిని పిలువకుండా స్టేషన్ కి వెళ్లేటప్పుడు, లేదా ట్రైన్ చాలా స్టేషన్లలో నాన్ స్టాప్ గా వెళ్తుంది అని ప్యాసింజర్ లకి చెప్పడానికి సంకేతంగా, ఇంకా అనేక కారణాల్లో వాడతారు.

#10 ఒక లాంగ్ హార్న్ తర్వాత ఒక షార్ట్ హార్న్  (రెండు సార్లు)

ఇది చైన్ లాగడాన్ని, ఇంకా గార్డ్ వ్యాక్యూమ్ బ్రేక్స్ వేయాలని సూచిస్తుంది.

#11 ఆరు షార్ట్ హార్న్స్

ఇది డబల్ లైన్ మీద ట్రైన్ తప్పు డైరెక్షన్ లో వెళుతున్నప్పుడు, లేదా ట్రైన్ ప్రమాదంలో ఉన్నప్పుడు ఉపయోగిస్తారు.


End of Article

You may also like