Ads
తెలుగు వారు జరుపుకునే ముఖ్య పండగల్లో ఉగాది పండుగ కూడా ఒకటి. ఉగాది నాడు కొన్ని రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటాము. అలానే ఉగాది అంటే మనకి మొదట గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం.
Video Advertisement
ఈ రోజుల్లో కూడా పంచాంగ శ్రవణాన్ని చెప్పించుకోవడానికి పండితుల్ని ఇంటికి పిలిపిస్తున్నారు. ఈ కొత్త సంవత్సరం వాళ్లకి ఏ రకమైన ఇబ్బందులు రాబోతున్నాయి..
Ugadi Telugu wishes images
ఎలాంటి మంచి భవిష్యత్తులో ఎదురు కాబోతోంది.. వ్యాపార విషయాలు మొదలైన వాటిని తెలుసుకుంటూ ఉంటారు. శోభక్రుత్ నామ సంవత్సరం రాశి ఫలాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం..
Ugadi Telugu wishes images
ఈ సంవత్సరం ఉగాది పండుగ ఏప్రిల్ 22న వచ్చింది. ఉగాదినాడు ఉగాది పచ్చడిని రుచికరంగా తయారు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పంచుకుంటూ ఉంటారు. ఉగాది నాడే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి తెలుగు వారి తొలి పండగ ఉగాది. దక్షిణాది రాష్ట్రాలలో ఉగాది ని ఎంతో చక్కగా జరుపుకుంటారు. కర్ణాటక. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర లో అత్యంత వైభవంగా ఉగాదిని జరుపుకుంటారు.
తెలుగు ప్రజలు ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మనకి వచ్చే మొదటి మాసం చైత్ర మాసం. చైత్రమాసం మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటాము. ఈసారి వచ్చే తెలుగు సంవత్సరం పేరు శోభకృత్ నామ సంవత్సరం. ఇక ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదురయ్యబోతున్నాయి.. శుభ సమయం మొదలైన వివరాలను ఇప్పుడు చూద్దాం.
శోభకృత్ సంవత్సర తెలుగు రాశి ఫలాలు 2023-2024:
తిథి ప్రారంభం: మార్చి 21, 2023 రాత్రి 10:52 గంటలకు
తిథి ముగింపు: మార్చి 22, 2023 రాత్రి 08:20 గంటలకు
2023-2024 మేషరాశి రాశి ఫలితాలు:
ఆదాయం, వ్యయం సమానంగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళు ధనాన్ని మంచి పనుల కోసం ఖర్చు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. మీ మొహమాటంతో రుణ సమస్యలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు విజయమవుతాయి. కుటుంబీకుల సహకారం ఉంటుంది. అభిప్రాయ బేధాలు ఎవరితో రాకుండా జాగ్రత్త పడండి.
ఆదాయం:5, వ్యయం:5, రాజపూజ్యం:3, అవమానం:1
2023-2024 వృషభ రాశి ఫలితాలు:
మీరు చేసే పనుల్లో విజయం అందుతుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో అవకాశాలు వస్తాయి. వ్యాపారం కూడా బాగా సాగుతుంది. విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఏప్రిల్ 22 తర్వాత ద్వాదశంలో గురు సంచారం వలన ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. గురు శ్లోకం చదువుకుంటే మంచిది. అక్టోబర్ వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఆదాయం:14, వ్యయం:11, రాజపూజ్యం:6, అవమానం: 1
2023-2024 మిధున రాశి ఫలితాలు:
కష్టపడి పని చేయడం మంచిది. అదృష్ట యోగం 50 శాతం దాకా బాగుంది. ఆదాయానికి మించిన ఖర్చులు అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఏప్రిల్ 22 వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ఆదాయం:2, వ్యయం:11, రాజపూజ్యం:2, అవమానం:4
2023-2024 కర్కాటక రాశి ఫలితాలు:
అష్టమ శని దోషం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు కూడా రాణిస్తారు. ఉద్యోగంలో కూడా చక్కటి ఫలితాలు పొందొచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. శని శ్లోకం చదువుకోవడం మంచిది. నవంబర్ నుండి విఘ్నాలు ఎదురవవచ్చు.
ఆదాయం:11, వ్యయం:8, రాజపూజ్యం:5, అవమానం:4
2023-2024 సింహరాశి ఫలితాలు:
సింహ రాశి వాళ్ళకి ధనయోగం. సింహ రాశి విద్యార్థులకు కూడా గురుబలం వల్ల ఉన్నత ఫలితాలని ఎదుర్కొంటారు. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. కష్టం ఫలిస్తుంది. వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
ఆదాయం:14, వ్యయం:2, రాజపూజ్యం:1, అవమానం: 7
2023-2024 కన్యా రాశి ఫలితాలు:
సౌమ్యంగా సంభాషించడం మంచిది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి కూడా శుభ ఫలితాలు వస్తాయి. ఏకాగ్రతతో పని చేయండి గురు బలం లేదు. వ్యాపారం బాగుంటుంది. పనులను వాయిదా వేయకండి. ఏప్రిల్ 23 నుండి అష్టమ సంచారం కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. గురు శ్లోకం చదువుకుంటే మంచిది.
ఆదాయం:2, వ్యయం:11, రాజపూజ్యం:4, అవమానం:7
2023-2024 తులా రాశి ఫలితాలు:
విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకి ఉద్యోగం కూడా వస్తుంది. వ్యాపారంలో లాభాలు కూడా వస్తాయి. కొత్త ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకి అనుకూలంగా ఉంటుంది. అదృష్టం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ఆలోచనల్లో స్పష్టత లోపించకుండా చూసుకోవడం మంచిది.
ఆదాయం:14, వ్యయం:11, రాజపూజ్యం:7, అవమానం:7
2023-2024 వృశ్చిక రాశి ఫలితాలు:
విద్యార్థులు కి ఏప్రిల్ 22 వరకు చక్కటి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగులకి కూడా అనుకూలమైన సమయమే. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంట్లో శాంతి ఉంటుంది. మొహమాటం వలన ఖర్చులు పెరుగుతాయి చూసుకోండి.
ఆదాయం:5, వ్యయం:5, రాజపూజ్యం:3, అవమానం: 3
2023-2024 ధనస్సు రాశి ఫలితాలు:
ఆదాయానికి మించిన ఖర్చులు ఈ రాశి వాళ్ళకి ఉంటాయి. ఉద్యోగులకి బాగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. గురువు చతుర్ధంలో ఉండడం వలన ఏప్రిల్ 22 వరకు మిశ్రమ ఫలితాలు పొందొచ్చు.
ఆదాయం:8, వ్యయం:11, రాజపూజ్యం:6, అవమానం:3
2023-2024 మకర రాశి ఫలితాలు:
మకర రాశి వాళ్ళకి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ధనయోగం కూడా. కుటుంబంలో ప్రేమానురాగాలతో నడుచుకోండి. మనోబలంతో లక్ష్యాలని సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏలినాటి శని దోషం కారణంగా తెలియని ఆటంకాలు కలుగవచ్చు.
ఆదాయం:11, వ్యయం:5, రాజపూజ్యం:2, అవమానం:6
2023-2024 కుంభ రాశి ఫలితాలు:
ఈ రాశి వాళ్ళకి అద్భుతమైన ధన లాభం లక్ష్యాన్ని చేరుకోవడం కోసం పనులు వాయిదా వేయొద్దు. విద్యార్థులకి కూడా శుభ ఫలితాలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. వ్యాపారం కూడా బాగుంటుంది.
ఆదాయం:11, వ్యయం:5, రాజపూజ్యం:5, అవమానం:6
2023-2024 మీన రాశి ఫలితాలు:
రుణ సమస్యలు కలుగవచ్చు. గురు బలం వల్ల విద్యార్థులకి విజయం అందుతుంది. ఏప్రిల్ నుండి ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. చక్కటి నిర్ణయాలు తీసుకుంటే ఇంట్లో శాంతి ఉంటుంది.
ఆదాయం:8, వ్యయం:11, రాజపూజ్యం:1, అవమానం:2
Ugadi wishes images 2023 (16)
Ugadi wishes images 2023
Ugadi Telugu wishes images
Ugadi Telugu wishes images
Ugadi Telugu wishes images
Ugadi Telugu wishes images
Ugadi Telugu wishes images
Ugadi Telugu wishes images
Ugadi Telugu wishes images
Ugadi Telugu Images 2023
Ugadi Telugu wishes images
Ugadi Telugu wishes images
End of Article