యూకే కొత్త ప్రధాన మంత్రి “రిషి సునక్”… ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

యూకే కొత్త ప్రధాన మంత్రి “రిషి సునక్”… ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

by Megha Varna

Ads

భారత సంతతికి చెందిన రిషి సునక్ యునైటెడ్ కింగ్‌డమ్‌కు నాయకత్వం వహించే మొదటి వ్యక్తిగా నిలిచారు. ఇది నిజంగా ఆనందకరమైన విషయం. చరిత్రలో ఎన్నడూ ఇలాంటిది చోటు చేసుకోలేదు. నిజంగా చరిత్ర సృష్టించారు.

Video Advertisement

అయితే యూకే కొత్త ప్రధానమంత్రి అయిన “రిషి సునక్” ఆస్తుల విలువ ఎంతో తెలుసా…? మరి వాటి కోసమే ఇప్పుడు చూద్దాం.

రిషి సునక్ ఎలా డబ్బులను సంపాదిస్తారు..?

#1. రిషి సునక్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు ఆయనకీ వచ్చే జీతం £151,649. అదే తాను నాయకత్వ పోటీలో కనుక గెలిచినట్టైతే మీరెంత ఎక్కువ వస్తుంది.
#2. రాజకీయాల్లోకి రిషి రాకముందు ఎక్కువ లాభాలు వచ్చే హెడ్జ్ ఫండ్లలో పార్టనర్ కింద వున్నారు.
#3. గోల్డ్ మన్ సాచ్స్ అనే ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కి 2001 నుండి 2004 వరకు ఎనలిస్ట్ కింద వున్నారు.
#4. రిషి ఇన్ఫోసిస్ లో £690 మిలియన్ల విలువైన 0.93% వాటా ఉన్న అక్షతా మూర్తిని పెళ్లి చేసుకున్నాక ఆస్తి మరెంత పెరిగింది.

రిషి సునక్ ఆస్తి వివరాలు:

#1. రిషి సునక్ అలానే రిషి భార్య అక్షతా మూర్తిల ఆస్తి £730 మిలియన్స్ ఉందిట. ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ జాబితాలో.. యుకె లో టాప్ 250 రిచెస్ట్ పెర్సన్స్ లిస్ట్ లో 222 వ స్థానం రిషి సునక్ అలానే రిషి భార్య అక్షతా మూర్తిలకి లభించింది.
#2. హౌస్ ఆఫ్ కామన్స్ లో సునక్ అత్యంత ధనవంతుడు.
#3. రిషి భార్య బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ II కంటే ధనవంతురాలట. ఆమె ఆస్తి 430 మిలియన్ పౌండ్లు.
#4. రిషి మరియు ఆయన భార్యకి నాలుగు ఇళ్లు ఉన్నాయి. రెండు లండన్ లో ఉండగా.. ఒకటి యార్క్ షైర్ లో ఒకటి LA లో వుంది.


#5. కెన్సింగ్టన్ లోని ఫైవ్ బెడ్ రూమ్స్ హౌస్ వుంది. దీని విలువ £7 మిలియన్లు. నాలుగు అంతస్తుల ఇంట్లో అయితే ఓ ప్రైవేట్ తోట ఉంది.
#6. లండన్లోని ఓల్డ్ బ్రాంప్టన్ రోడ్ లోని అయితే ఒక ఇల్లు ఉ౦ది. అక్కడకి వెళితే ఆ ఇంట్లో వీళ్ళు ఉంటారట.
#7. యార్క్ షైర్ లో వీరికి పన్నెండు ఎకరాల గ్రేడ్-II లిస్టెడ్ జార్జియన్ మాన్షన్ మరియు ఆర్నమెంటల్ లేక్ వున్నాయి.
#8. అలానే కాలిఫోర్నియాలోని పెంట్ హౌస్ కూడా వుంది.


End of Article

You may also like