మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Video Advertisement

ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

umair sandhu review about waltair veerayya trailer..

అయితే తాజాగా వాల్తేరు వీరయ్య చిత్ర ట్రైలర్ రివ్యూ బయటకు వచ్చింది. దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు వాల్తేరు వీరయ్య ట్రైలర్ రివ్యూ చెప్పేశారు. సోషల్ మీడియాలో ఉమైర్ సంధు ఈ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. ” వాల్తేరు వీరయ్య ట్రైలర్ మాస్ ధమాకా లా ఉంది. ఇది చిరంజీవి కం బ్యాక్ ఫిలిం అని ఇప్పుడు చెప్పొచ్చు. అద్భుతంగా ఉంది.” అని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

umair sandhu review about waltair veerayya trailer..

కానీ కొందరు నెటిజన్లు మాత్రం గతం లో ఆచార్య సినిమా సమయంలో కూడా ఈయన సూపర్ హిట్ రివ్యూ ఇచ్చారు. తీరా చూస్తే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది..ఇప్పుడు కూడా చిరంజీవి కం బ్యాక్ అంటున్నారు.. చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

umair sandhu review about waltair veerayya trailer..

అయితే ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా నుంచి బాస్ పార్టీ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి అదిరిపోయే మ్యూజిక్ అందించనున్నారు. ఈ క్రమంలోనే నేడు విడుదలైన బాస్ పార్టీ సాంగ్ దుమ్మురేపుతోంది. మరోసారి దేవి తన స్టైల్ లో మాస్ మసాలా సాంగ్ ను కంపోజ్ చేశారు. ఇక ఈ పాటలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది.