దర్శకుడు గుణశేఖర్ ది ఓ విభిన్న ఆలోచనా విధానం. కళ్ళ ముందు విజువల్ వండర్ ను ఆవిష్కరించాలనుకుంటారు. చివరిగా ఆయన చారిత్రక నేపథ్యం లో వచ్చిన రుద్రమదేవి చిత్రం చేసారు. అయితే ఆ చిత్రం తర్వాత మరో చిత్రం చెయ్యలేదు గుణశేఖర్. అయితే చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తో ‘శాకుంతలం’ సినిమా చేసారు.

Video Advertisement

ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) – గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ ‘శాకుంతలం’ సినిమాను నిర్మిస్తున్నారు. మొదట గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకున్నారు. ఆ తర్వాత ఫిబ్ర‌వ‌రి 17 అనుకున్నారు. చివరికి ఏప్రిల్ 14 నా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కాకపోవడం తో ఈ చిత్రం తరచూ వాయిదాలు పడుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

umair sandhu review on shakunthalam movie..!!

దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు క‌బ్జ‌ మూవీ రివ్యూ చెప్పేసారు. ” శాకుంతలం మూవీ ఫైనల్ కట్ ఎడిటింగ్ పూర్తి అయ్యింది. ఇన్సైడ్ రిపోర్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సమంత మంచి చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది ” అని ఉమైర్ సంధు ట్వీట్ చేసారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు.

umair sandhu review on shakunthalam movie..!!

ఇందులో శకుంతల పాత్రలో సమంత… ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ స్వయంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లేపై పనిచేశారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ మరియు మూడు పాటలు మార్కెట్‌లో సంచలనం సృష్టించాయి. ఈ చిత్రం లో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అల్లు అర్హ, అదితి బాలన్, అనన్య నాగళ్ల మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.