సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. వాటిలోనూ ముఖ్యంగా సౌత్ సినిమాల ఆధిపత్యం కొనసాగుతోంది. సౌత్‌ నుంచి విడుదలవుతున్న ప్రతి ఒక్క సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. సౌత్‌ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ల లిస్ట్‌ కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. బాలీవుడ్‌ హీరోలు, నిర్మాతలు సౌత్‌ సినిమాలను పొగడటం మొదలు పెట్టారు. నార్త్‌- సౌత్‌ అని తేడా లేదు.. మొత్తం ఒకటే ఇండస్ట్రీ అనే మాటలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.

Video Advertisement

అయితే సినిమా ఇండస్ట్రీలో మూడేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి లేదు. ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్‌ సినిమాలే అనే పరిస్థితి ఉండేది. ఎంత పెద్ద స్టార్‌ హీరో సినిమా అయినా కూడా అది సౌత్‌ సినిమా అని ముద్ర వేసేవారు. హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా సౌత్‌ లో రెండు, మూడు సినిమాలు హిట్ కొట్టగానే బాలీవుడ్‌ వైపు పరుగులు పెట్టేవారు. అక్కడ వారి అదృష్టాన్ని పరీక్షించుకుని.. అక్కడే సెటిల్‌ అయ్యేవారు.

 

umair sandhu tweet about south heros..!!

ప్రస్తుతం మన సౌత్ హీరోలకు బాలీవుడ్ లో మార్కెట్ బాగా పెరిగిపోయింది. సౌత్ లో చిన్న సినిమాల డబ్బింగ్ చిత్రాలు కూడా అక్కడ రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదిస్తున్నాయి. అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, నితిన్, ఆది సాయి కుమార్, రామ్ పోతినేని, బెల్లం కొండ శ్రీనివాస్ ల చిత్రాలు ఇక్కడ ప్లాప్ అయినా హిందీ లో రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదిస్తున్నాయి.

umair sandhu tweet about aouth heros..!!

అయితే దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు తాజాగా సౌత్ హీరోస్ గురించి ట్వీట్ చేసాడు. “పవన్ కళ్యాణ్, అజిత్, విజయ్ లకు నార్త్ లో సరైన మార్కెట్ లేదు. వారి డబ్బింగ్ చిత్రాలు అక్కడ కనీసం బిజినెస్ చేయలేకపోయాయి.” అని ఉమైర్ సంధు ట్వీట్ చేసాడు.

umair sandhu tweet about aouth heros..!!

దీంతో పలువురు నెటిజన్లు అతడిని విమర్శిస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఎందుకు ఇలాంటి ట్వీట్స్ పెడ్తున్నాడు అంటూ మంది పడుతున్నారు ఫాన్స్. ఊరికే తిట్టించుకోవడానికే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. పద్దతి మార్చుకోవాలని ఉమైర్ కు హితవు పలుకుతున్నారు. మరోవైపు ఉమైర్ సందు తన ట్వీట్స్ కి ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా.. సెలెబ్రెటీల గురించి అనధికారిక ట్వీట్స్ చెయ్యడం మానట్లేదు.