సినిమాల్లో హీరో హీరోయిన్ల ముద్దు సీన్ల వెనక ఇంత కథ ఉందా.?

సినిమాల్లో హీరో హీరోయిన్ల ముద్దు సీన్ల వెనక ఇంత కథ ఉందా.?

by Anudeep

Ads

ఓ సినిమా ను షూట్ చెయ్యాలి అంటే అంత తేలిక ఏమి కాదు. ప్రతి పనికి, ప్రతి సీన్ కి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉండాలి. అంతే కాదు ఆ స్క్రిప్ట్ కి తగ్గట్లే సినిమా రావాలి. ఆచరణ లో కానీ, షూటింగ్ లో కానీ ఏ చిన్న తేడా జరిగినా రీ షూట్ చేయాల్సి వస్తుంది. ఆ సీన్ కోసం అప్పటి వరకు పెట్టిన ఖర్చు కూడా వృధా అవుతుంది.

Video Advertisement

కిస్ సీన్స్ వంటివాటిని తీయాల్సి వచ్చినప్పుడు కూడా చాలా సార్లు యాక్టర్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజానికి మనం ఎవరిపైన అయినా గాఢమైన ప్రేమ ఉంటె తప్ప చనువుగా ముద్దు పెట్టుకోలేము. మరి యాక్టర్లు ఆ సన్నివేశాలు సహజంగా రావడానికి ఎలా ప్రయత్నిస్తారో ఇప్పుడు చూద్దాం.

kiss scene 4

కొంత కాలం క్రితం వరకు నిజంగా ముద్దు పెట్టుకునేవారు కాదు. కెమెరా తో జిమ్మిక్కులు చేసి హీరో, హీరోయిన్లు ముద్దు పెట్టుకున్నట్లు చూపించేవారు. ఏదైనా బెలూన్ వంటివాటిపై ముందు ముద్దు పెడుతున్నట్లు సీన్ ని షూట్ చేసేవారు. ఆ తరువాత ఆ ప్లేస్ లో హీరో లేదా హీరోయిన్ ముద్దు పెడుతున్నట్లు వీడియో ని ఎడిట్ చేసేవారు. ఇద్దరి చేత వేరు వేరుగా వీడియో షూట్ చేసి జాయింట్ చేసేవారు.

kiss scene 2

ప్రస్తుతం అయితే.. నిజంగానే ముద్దు పెట్టుకుంటూ షూట్ చేసేస్తున్నారు. అయితే.. ఇందుకోసం హీరో హీరోయిన్లు ఇద్దరు సినిమా సెట్స్ లో మంచి స్నేహాన్ని పెంపొందించుకుంటారు. చనువుగా ఉంటారు. అప్పుడు సినిమాలో నటిస్తున్నప్పుడు కిస్ సీన్లు అసహజంగా లేకుండా అందంగా వస్తాయి. వారు కేవలం నటిస్తారు. సినిమా అందంగా రావడం కోసం.. సినిమాలో సీన్ డిమాండ్ చేస్తే నటించడానికి అభ్యంతరం చెప్పరు.

kiss scene 3

ఒకవేళ ఎవరైనా అభ్యంతరం చెబితే.. వారికి తగ్గట్లే ఆ సీన్ ను షూట్ చేసేస్తారు. ఆ తరువాత కెమెరా పనితనంతో నిజంగా ముద్దు పెట్టుకున్నట్లు చూపిస్తారు. లవ్ స్టోరీ మూవీ లో సాయి పల్లవి, చైతు ను ముద్దు పెట్టుకునే సీన్ కూడా ఇలాంటిదే. సాయి పల్లవి మొదటి నుంచి ఇటువంటి సీన్స్ కు దూరంగానే ఉంటూ వచ్చారు. అందుకే ఆ సీన్ ను షూట్ చేసేటప్పుడు శేఖర్ కమ్ముల మాయ చేసేసారు. ఈ విషయాన్నీ సాయి పల్లవినే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అదన్నమాట సినిమాల్లో ఉండే ముద్దు సీన్ల వెనక ఉండే స్టోరీ.


End of Article

You may also like