“కృష్ణంరాజు” మొదటి భార్య ఎలా చనిపోయారో తెలుసా..? ఆవిడ గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!

“కృష్ణంరాజు” మొదటి భార్య ఎలా చనిపోయారో తెలుసా..? ఆవిడ గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!

by Anudeep

Ads

టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు గురించి ప్రత్యేకించి ఎటువంటి ఇంట్రో అవసరం లేదు. ఆయన ఈ ఆదివారం తెల్లవారుజామున ఎవ్వరూ ఊహించని విధంగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సినీరంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఈయన బాగా రాణించారు. కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్ గా, విలన్ గా చేసిన కృష్ణంరాజు.. అటు తర్వాత క్రమంగా హీరోగా మారారు. ఆయన నటించిన తొలి చిత్రం చిలకా గోరింక.

Video Advertisement

ఆగ్రహంతో కృష్ణం రాజు డైలాగ్ చెబుతుంటే థియేటర్లలో చప్పట్లు కురిసేవి.పౌరాణికం, చారిత్రకం, సాంఘికం.. ఇలా ప్రతి కథలోనూ ఆయన తన వినూత్నమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు.50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన 197 సినిమాల కు పైగా నటించి,10 సినిమాలు నిర్మించారు.

unknown details about krishnam raju first wife

కానీ కృష్ణంరాజు పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. కృష్ణంరాజు గారికి మొదటి పెళ్లి సీతాదేవి గారితో మే 10, 1969 న జరిగింది. సీతాదేవి కృష్ణంరాజు గారికి స్వయానా మేనకోడలు. ఆయన తన బావగారి కూతురు ని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి టైంకి కృష్ణం రాజు ‘అమ్మ కోసం’ చిత్రం లో నటిస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఒక జంట కాగా కృష్ణం రాజు, రేఖ మరో జంటగా నటించారు.

unknown details about krishnam raju first wife

మొగల్తూరు కోటలో జరుగుతున్న కృష్ణంరాజు వివాహానికి ‘అమ్మ కోసం’ చిత్రం నటీనటులు అందరూ షూటింగ్ స్పాట్ నుంచి నేరుగా వచ్చి హాజరయ్యారు. ఊహించని విధంగా 1995లో ‘సీతా దేవి’ గారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఇది జరిగిన తర్వాత కృష్ణం రాజు కొంత కాలం డిప్రెషన్ లో ఉండిపోయారు. కానీ తర్వాత కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు శ్యామలా దేవి గారిని రెండో పెళ్లి చేసుకున్నారు.


End of Article

You may also like