Ads
“సంధ్యా రాజు” ఎవరో నిన్న మొన్నటి వరకు చాలా మందికి తెలియదు. కానీ “నాట్యం” షార్ట్ ఫిలిం రిలీజ్ అయ్యాక ఆమె మంచి నటి కూడా అన్న విషయం గ్రహించారు. ఈ షార్ట్ ఫిలిం బాగా హిట్ అయింది. కానీ సంధ్యా రాజు కు అంత గుర్తింపు అయితే రాలేదు. ఇప్పుడు “నాట్యం” ఫుల్ లెంగ్త్ సినిమా ఈ నెల 22 వ తేదీ థియేటర్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటినుంచీ సంధ్యా రాజు ఎవరు అన్న ఉత్సుకత మొదలైంది. ఆమె అందం, అభినయం అందరిని ఆకట్టుకున్నాయి.
Video Advertisement
ఆమె ఎవరో కాదు. మనందరికీ తెలిసిన ‘సత్యం’ రామలింగరాజు కోడలు.. ‘రామ్‌కో’ ఛైర్మన్ వెంకట్రామరాజు కు కుమార్తె. చిన్నప్పటినుంచి ఆమెకు నాట్యం పై ఆసక్తి మెండు గా ఉండేది. ఓ సారి బెంగళూరు లో వెంపటి చినసత్యంగారి ‘క్షీరసారగమథనం’ ను సంధ్యా రాజు గారు తన చిన్నతనం లో చూశారట. అప్పటినుంచి తాను కూడా నాట్యం నేర్చుకోవాలి అని ఫిక్స్ అయ్యారట. వారు మద్రాస్ లో ఉండేవారు. అక్కడ వాళ్ళింటిపక్కనే చినసత్యంగారి అకాడెమీ ఉండేదట.
నాట్యం పై కూతురి ఆసక్తిని గమనించిన సంధ్యా తల్లిగారు ఆమెను ఆ అకాడెమి లో చేర్పించి శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి ఆమెకు నాట్యమే ప్రపంచమైపోయింది. స్కూల్ అవ్వగానే గురువు గారిదగ్గర నాట్యం ప్రాక్టీస్ చేయడమే తన పని అయిపొయింది. టీనేజీ వయసు కు వచ్చాక కూచిపూడి నాట్యం లో ప్రావీణ్యత సంపాదించుకుంది. తన నృత్య ప్రదర్శన చూసినవారు.. హావభావాలు కూడా బాగా ఇవ్వడం చూసి.. మోడలింగ్ చేస్తారా? అంటూ అడిగేవారట.
అలా రెండు మూడు చోట్ల ఆమె నాట్య ప్రదర్శన చేశారట. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో ‘జునూన్’ అనే లఘు చిత్రం లో కూడా నటించారట. కూచిపూడి లోనే ఎక్కువ పెరిగిన తనకు సినిమా ప్రపంచం పూర్తి గా కొత్త. అయినప్పటికీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించడం తో ఆమె ఈ దిశగా కూడా అడుగులు వేశారు. అంతే కాదు ఆమె ఇప్పటికీ నృత్య ప్రదర్శనలు ఇవ్వడం మానలేదు. తన తాతగారు అయిన రామ్‌కో వ్యవస్థాపకులు పీఆర్ రామస్వామిరాజాగారి జయంతికి తమిళనాడు లో సొంతూరు కు వెళ్లి నృత్య ప్రదర్శన ఇస్తారట.
నాట్యం పై అభిరుచితోనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారట. ఈ కాన్సెప్ట్ నచ్చడం తో ఈ సినిమా కు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమా కు నృత్య దర్శకత్వం కూడా సంధ్యా రాజు నే చేస్తున్నారు. కుటుంబం లో అందరు పారిశ్రామిక వేత్తలే అయినప్పటికీ.. నాట్యాన్ని నమ్ముకుని కళాకారిణిగా ఆమె ఇంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె భర్త రామరాజు సైతం ఆమెను ప్రోత్సహిస్తూ, ఆమెను చూసి గర్వ పడుతుండడం విశేషం. ఎంతైనా సంధ్యా రాజు జీవితం ఎందరో అమ్మాయిలకు ఆదర్శమే.
End of Article