Ads
బాహుబలి సినిమా తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. హీరో ప్రభాస్ ను కూడా ఇంటర్నేషనల్ స్టార్ ను చేసింది. వేయి కోట్ల కలెక్షన్ సాధించిన మొదటి ఇండియన్ సినిమా గా బాహుబలి నిలిచింది. కానీ.. ఈ సినిమా కి సంబంధించి చాలా విషయాలు ప్రేక్షకులకు తెలియవు. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తొలుత హిందీ లో తీయాలని భావించారట. అందుకోసం పాత్రల అన్వేషణ కూడా చేసారు.
Video Advertisement
తొలుత.. బాహుబలి గా హృతిక్ రోషన్ ను, భల్లాలదేవ గా జాన్ అబ్రహం ను అనుకున్నారట. కానీ, ఆ తరువాత రాజమౌళి ఈ సినిమాను హిందీ లో తీయాలనే ఆలోచనను మానుకుని.. తెలుగు లో తీయాలనుకున్నారట. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు గారు (దివంగత) ప్రభాస్ ను ఒక రాజు లాగా, వారియర్ లాగా చూడాలని ముచ్చటపడేవారట. ఈ విషయాన్నీ కీరవాణి తో పదే పదే చెబుతుండేవారట. కీరవాణి కెరీర్ లో నిలదొక్కుకోవడానికి సూర్య నారాయణ రాజు గారు హెల్ప్ చేసారు. దీనితో.. బాహుబలి పాత్రకు ప్రభాస్ ఎలా ఉంటాడని ప్రశ్నించుకున్నారు.
అలా.. బాహుబలి రోల్ కు ప్రభాస్ సెట్ అయ్యారు. ఈ సినిమాను తెలుగు లో తీద్దాము అని అనుకున్న తరువాత.. తెలుగు వారికీ సుపరిచితులైన యాక్టర్లను తీసుకోవాలనుకున్నారు. అలా ఎవరిని అనుకుని ఎవరిని తీసుకున్నారో ఇప్పుడు లిస్ట్ చూద్దాం.
#1 బాహుబలి:
ఈ పాత్రకి ముందు హృతిక్ రోషన్ ను అనుకున్నారు. కానీ ప్రభాస్ ను ఎంపిక చేసారు.
#2 భల్లాల దేవ:
ఈ పాత్రకి రానా కంటే ముందు గా జాన్ అబ్రహం ను అనుకున్నారు.
#3 కట్టప్ప:
బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉందొ తెలిసిందే. ఈ పాత్రకి తొలుత మోహన్ లాల్ ను అనుకున్నారు. ఆయన ఒప్పుకోకపోయే సరికి సత్యరాజ్ ను ఎంచుకున్నారు.
#4 శివగామి:
ఈ పాత్రకి తొలుత శ్రీదేవిని సంప్రదించారు. అయితే.. ఆమె తిరస్కరించారు. ఆ తరువాత మంచు లక్ష్మి ని కూడా అడిగారు. కానీ ప్రభాస్ కి తల్లి పాత్ర తాను చేయనని చెప్పడం తో.. ఈ పాత్ర కు రమ్యకృష్ణను ఎంచుకున్నారు.
#5 అవంతిక:
ఈ పాత్రకు మొదట బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ను ఎంచుకున్నారట. ఐతే.. రెండేళ్లు షూటింగ్ డేట్స్ అడిగేసరికి ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ఈ పాత్రకు తమన్నా ను ఎంచుకున్నారు.
ఇది కూడా చదవండి :నాగార్జున ‘శివ మణి’ ఫోన్ నెంబర్ కి ఎవరెవరు కాల్ చేసారు
End of Article