ఆడవాళ్లు జడ వేసుకోవడం వెనక ఇంత అర్ధం ఉందా..? జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారంటే..?

ఆడవాళ్లు జడ వేసుకోవడం వెనక ఇంత అర్ధం ఉందా..? జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారంటే..?

by Anudeep

Ads

ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట హెయిర్ ని వదిలేయడం ఎక్కువ అయింది కానీ.. ఒకప్పుడు అందరు ఆడవాళ్లు వయసు తో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ వేసుకోవడం లో కూడా మూడు రకాలుండేవి. రెండు జడలు వేసుకోవడం, ఒక జడ వేసుకోవడం, ముడి పెట్టుకోవడం. వీటి వెనక అసలు అర్ధం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

rendu jadalu

ఆడపిల్లలు రెండు జడలు వేసుకుంటే.. ఆమె ఇంకా చిన్న పిల్ల అని, పెళ్లి కాలేదని అర్ధం. అంటే ఆ అమ్మాయిలో జీవేశ్వర సంబంధం విడి విడిగా ఉందని అర్ధము. అదే పెళ్లి అయ్యిన వారు అయితే మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడ గా వేసుకునే వారు. అంటే.. ఆమె తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకుని భర్త తో కలిసి ఉంటోందని అర్ధం. అలా కాకుండా.. జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం వచ్చేలా ఇలా వేసుకునేవారు.

oka jada

అయితే.. ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా.. చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని మూడు పాయలు గా విడతీసి త్రివేణీసంగమం లా కలుపుతూ అల్లేవారు. ఈ మూడు పాయలకు రకరకాల అర్ధాలు ఉండేవి.. తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం. ఇంకా, సత్వ, రజ, తమో గుణాలు ; లేదా జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అన్న అర్ధాలు కూడా ఉండవచ్చని పెద్దలు చెప్పేవారు.

koppu

అమ్మాయిలు వేసుకున్న జడని బట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది. ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడుచేసుకుంటున్నాం.


End of Article

You may also like