జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకమైన పరిచయం అనవసరం. గత ఏడేళ్లు గా ఎంతో మంది ఆర్టిస్ట్ లను పరిచయం చేస్తూ.. ఎందరో ఇళ్లల్లో నవ్వుల పూవులు పూయిస్తోంది. ఈ షో స్టార్ట్ అయిన తొలినాళ్లలో ఎక్కువ గా మేల్ ఆర్టిస్ట్ లే జబర్దస్త్ లో కనిపించే వారు. వారే ఆడవారి పాత్రలను కూడా ధరిస్తూ.. పంచ్ లు వేసి మెప్పించే వారు. దాదాపు చాలా ఏళ్ల వరకు ఇదే ట్రెండ్ కొనసాగింది.

jabardast sathya sri 1

అయితే.. దీనికి ఫుల్ స్టాప్ పెట్టి.. “సత్య శ్రీ” కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చారు. ఆమె జబర్దస్త్ స్కిట్ లలో వేసిన తొలి లేడీ ఆర్టిస్ట్. చమ్మక్ చంద్ర స్కిట్ లలో ఆమె పార్టిసిపేట్ చేసి మెప్పించేది. ఓవర్ ఆక్షన్ లేకుండా.. ఎంతో పరిణతి చెందిన నటనను కనబరుస్తూ.. సైలెంట్ గా పంచ్ లు వేస్తూ జబర్దస్త్ ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. జబర్దస్త్ కి రాకముందు సత్య శ్రీ సీరియల్స్ లో నటించేవారట.

jabardast sathya sri 2

సీరియల్స్ లో నటించినప్పటికీ ఆమెకు అంత గుర్తింపు మాత్రం రాలేదు. చమ్మక్ చంద్ర స్కిట్ లలో కనిపించినప్పటి దగ్గరినుంచి.. ఆమె కు పాపులారిటీ పెరిగిపోయింది. ఇటు యూత్ ప్రేక్షకులకు, అటు గృహిణిలకు కూడా ఆమె దగ్గరైంది. సత్య శ్రీ మంచి డాన్సర్ కూడానట. ఆమె స్టేజి పై కూడా పలు సార్లు చమ్మక్ చంద్ర తో కలిసి డాన్స్ చేసి అలరించింది. ఆమె ఎంట్రీ ఇవ్వడం తో పాటు పలువురు లేడీ ఆర్టిస్ట్ లకు కూడా జబర్దస్త్ లోకి రావడానికి దారి చూపింది.

jabardast sathya sri

ఒక రకం గా ఆమె జబర్దస్త్ లో లేడీ ఆర్టిస్ట్ లు కూడా స్కిట్ లు వేసే ట్రెండ్ కి తెరలేపిందని చెప్పొచ్చు. ఆమె తరువాత వరుస గా రోహిణి, వర్ష, ఫైమా, పవిత్ర వంటి లేడీ ఆర్టిస్ట్ లు కూడా జబర్దస్త్ లో కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరు కూడా కామెడీ పండించడం లో మేల్ ఆర్టిస్ట్ లకు ఏ మాత్రం తగ్గకుండా దుమ్ము దులిపేస్తున్నారు.