“కార్తీక దీపం” సీరియల్ తెలుగునాట టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో అన్ని పాత్రలు తమ తమ పరిధిలో ఎంతో అద్భుతం గా ఆకట్టుకుంటాయి. ఈ సీరియల్ లో వంటలక్క పాత్ర లో నటించిన ప్రేమి తో పాటు విలన్ పాత్ర లో నటించిన మరో ఆక్టర్ మోనిత కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే, మౌనిత అసలు పేరేంటో మీకు తెలుసా..?

karthika deepam mounitha 1

మౌనిత అసలు పేరు శోభా శెట్టి. ఆమె కన్నడ అమ్మాయి. ఆమె బెంగళూరు లోనే పుట్టి పెరిగింది. చదువులో కూడా శోభా శెట్టి టాప్ లోనే ఉంది. ఆమె ఎంఎస్సి ని పూర్తి చేసింది. యాక్టింగ్ పై తనకు అభిరుచి ఉండడం తో కన్నడ లో కూడా ఆమె సీరియల్స్ లో నటించింది. కన్నడ లో ఆమె నటించిన సీరియల్ తెలుగునాట “అగ్నిసాక్షి” పేరుతొ ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ లో మౌనిత హీరోయిన్ గా నటించారు.

shobhita setty

అయితే, ఈ సీరియల్ లో నటిస్తుండగానే.. మౌనిత కు కన్నడ లో “అంజలి పుత్ర” అనే సినిమా లో అవకాశం వచ్చిందట. ఈ సినిమా లో హీరో కి చెల్లెలిగా నటించే అవకాశం రావడం తో.. ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకుందట. ఈ సినిమా తరువాత కూడా శోభా శెట్టి సీరియల్స్ లో నటించడం కొనసాగించింది. ఉదయ టివి లో ప్రసారం అయ్యే “కావేరి” సీరియల్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటించి మెప్పించింది.

ashtachama

కన్నడ సీరియల్స్ తెలుగు లోకి కూడా డబ్ అవుతుండడం తో.. శోభా శెట్టి తెలుగువారికి కూడా సుపరిచితమైంది. ఆమె తెలుగు లో మొదటి గా “అష్టాచెమ్మా” సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. ఈ సీరియల్ లో ఆమె నటనకు గాను ఆమెకు బెస్ట్ సీరియల్ యాక్టర్ గా అవార్డు కూడా లభించింది. ఆ తరువాత కార్తీకదీపం ‘మౌనిత’ గా తెలుగు వారికి మరింత చేరువైంది. ఆమె నటిస్తున్న లాహిరి లాహిరి లాహిరిలో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియళ్లు కూడా ఆమెకు ఎంతో మంది అభిమానులను సంపాదించిపెట్టాయి.

deepa and mounitha

అయితే.. వీటన్నిటికంటే.. తనకు కార్తీక దీపం సీరియల్ చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ సీరియల్ గాను మౌనిత బెస్ట్ విలన్ అవార్డు ని కూడా అందుకుంది. ఈ సీరియల్ లో వంటలక్క గా నటిస్తున్న ప్రేమి, తాను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకొచ్చింది.