Ads
విశ్వనాధ శాస్త్రి అంటే ఎవరు అంతగా గుర్తు పట్టరేమో కానీ.. ఐరన్ లెగ్ శాస్త్రి అనగానే.. ఆయన ఎందుకు తెలియదూ అనేస్తారు. ఆయన అందరికి తెలుసు.. కానీ, ఆయన జీవితం లో ఎంత విషాదం ఉందొ మాత్రం చాలా మందికి తెలియదు. అర్ధాంతరం గా ఆయన ఎందుకు సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చిందో.. ఆయన జీవితం లో ఉన్న విషాదమేంటో ఈరోజు తెలుసుకుందాం.
Video Advertisement
ఐరన్ లెగ్ శాస్త్రి అసలు పేరు విశ్వనాధ శాస్త్రి. ఆయన సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం. అప్పుల అప్పారావు సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా.. తెలుగు ఇండస్ట్రీ కి ఓ మంచి నటుడిని పరిచయం చేసింది. ఆయన భారీ శరీరమే ఆయనకు ఈ సినిమాలో అవకాశం తెచ్చి ఇచ్చిందని అంటూ ఉంటారు. ఆయన ఈ సినిమాలో కనిపించేది తక్కువే. ఆయన అడుగు పెడితే.. ఏ పని అయినా సర్వనాశనం అవుతుంది అన్న కాన్సెప్ట్ లో కామెడీ నడుస్తూ ఉంటుంది.
ఇవివి సత్యనారాయణ గారే ఆయనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమాల్లోకి రాకముందు విశ్వనాధ శాస్త్రి పౌరోహితం చేసేవారు. అయితే సినిమాలో నటించిన ఐరన్ లెగ్ శాస్త్రి పేరు తెచ్చిపెట్టడంతో సినిమాల్లోనూ అవకాశాలు పెరిగాయి. అయితే.. అన్ని పాత్రలు దాదాపు ఇదే కాన్సెప్ట్ లో ఉండేవి. దురదృష్టాన్ని తీసుకొచ్చే బ్రాహ్మడి పాత్రలే ఆయనకు ఎక్కువ వస్తూ ఉండేవి. లావు గా ఉన్నారు అన్న ఒక్క ట్రేడ్ మార్క్ ఆయనకు బోలెడు అవకాశాలు తెచ్చింది.
అయితే.. ఇదంతా కేవలం రంగుల ప్రపంచానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ఆయనను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. బరువు తగ్గితే అవకాశాలు తగ్గుతాయనుకున్నారేమో.. ఆ ప్రయత్నాలు సాగలేదు. అధిక బరువు కారణం గా అధిక రక్తపోటు తో గుండె జబ్బులు కూడా చుట్టుముట్టాయి. అయితే.. ఎక్కువ కాలం ఒకేతరహా పాత్రలు చేయడం తో.. మరో రకమైన నటనను కనబరుచుకోవడానికి ఆయనకు అవకాశం రాలేదు. ఆ తరహా కామెడీ కాలం చెల్లిపోయి ఐరన్ లెగ్ శాస్త్రి అవకాశాలు రావడం కూడా తగ్గింది.
ఓ వైపు అవకాశాలు తగ్గడం.. మరో వైపు అనారోగ్య సమస్యలు చుట్టముట్టడం తో ఆయన తిరిగి తన సొంత ఊరికి వెళ్లిపోయారు. అయితే.. సినిమాల వలన ఐరన్ లెగ్ అనే ముద్ర రావడం తో పురోహితుడు గా కూడా ఆయనకు అవకాశాలు దక్కలేదు. అది కేవలం నటనే అయినా.. ఆయన జీవితానికి మాత్రం శాపం గానే పరిణమించింది. అనారోగ్యం తో ఇబ్బందులు పడుతూ.. 2006 లో.. కేవలం 42 సంవత్సరాల వయసులోనే ఆయన కాలం చేసారు. చివరకు ఆయన చనిపోతే.. ఆయన దేహాన్ని రిక్షా లో పెట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితి మరీ బాధాకరం. ఆయన తదనంతరం ఆయన కుటుంబ సభ్యులు పలు ఆర్ధిక ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
End of Article