రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అని అనడానికి కారణం ఇదా.? ఇన్ని రోజులు తెలీదే.!

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అని అనడానికి కారణం ఇదా.? ఇన్ని రోజులు తెలీదే.!

by kavitha

Ads

నిత్యం వార్తల్లో, వార్త పత్రికలలో ఎక్కడో ఒక చోట లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని చదవడం లేదా వినడం, చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో లంచం తీసుకోవడం అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గవర్నమెంట్ ఆఫీసుల్లో అయితే లంచం ఇవ్వకుండా ఒక్క ఫైల్ కూడా కదలదని చెప్తుంటారు.

Video Advertisement

ఈ క్రమంలో చాలా మంది గవర్నమెంట్ అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరుకుతున్నారు. అలా చిక్కినపుడు లంచం తీసుకున్న డబ్బుతో పాటుగా పింక్ లేదా రెడ్ కలర్ ద్రావణం ఉన్న బాటిల్స్ కనిపిస్తుంటాయి. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగి లంచం అడిగినప్పుడు, ఆ బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు లంచం అడిగిన విషయం చెప్పగానే వారు రంగంలోకి దిగుతారు. ఏసీబీ అధికారులు బాధితుడికి లంచం ఇవ్వడానికి కొంత డబ్బు ఇస్తారు. అయితే ఆ డబ్బు మీద ముందుగానే ఫినాప్తలిన్ పౌడర్ ను చల్లి ఇస్తారు. బాధితుడు ఫినాప్తలిన్ పౌడర్ ను చల్లిన డబ్బును లంచం అడిగిన గవర్నమెంట్ ఉద్యోగికి ఇస్తారు.
డబ్బు ఇచ్చిన వెంటనే ఆ గవర్నమెంట్ ఉద్యోగి అడిగిన డబ్బులు ఉన్నాయో లేవో తెలుసుకోవడం కోసం ఆ డబ్బును  లెక్క పెడతారు. అయితే ఆ కరెన్సీ నోట్లకు ఉన్న పినాప్తలిన్ పౌడర్ సదరు ఉద్యోగి చేతులకు అంటుతుంది. వెంటనే ఏసీబీ ఆఫీసర్లు సీన్ లోకి ఎంట్రీ ఇస్తారు. లంచం తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగి చేతులను కాస్త సోడియం కార్బోనేట్ కలిపిన వాటర్ లో ముంచి తీస్తారు. ఫినాప్తలిన్ పౌడర్ సోడియం కార్బోనేట్ కలిపిన ద్రావణంలో ముంచడంతో ఉద్యోగి  చెయ్యి వెంటనే పింక్ రంగులోకి మారితుంది. అలా ఆ లంచం తీసుకున్న ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఏసీబీ అధికారులు పట్టుకున్న వ్యక్తితో పాటు, పింక్ కలర్ లోకి వచ్చిన ద్రావణంను కోర్టులో సాక్ష్యంగా చూపిస్తారు. అలా లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడేలా ఏసీబీ అధికారులు చేస్తారు.

watch video:

https://www.instagram.com/reel/Cwy8a95so5e/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: నేటి తరం ఝాన్సీ.. కళ్ళముందే ప్రాణాలు తీస్తున్న సైకోని అడ్డుకుని..? ఈమె తెగువకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!


End of Article

You may also like