తెలుగు ఇండస్ట్రీలో అన్యోన్యంగా ఉండే జంటలలో రాజశేఖర్, జీవిత జంట కూడా ఒకటి. 1991 లో రాజశేఖర్, జీవితలకు వివాహం జరిగింది. అయితే రాజశేఖర్ జీవిత లవ్ స్టోరి గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిక. వీరు ప్రస్తుతం వరుస ఆఫర్లతో తమ కెరీర్ లో రాణిస్తున్న విషయం  తెలిసిందే.

Video Advertisement

నిజానికి జీవితా రాజ‌శేఖ‌ర్ లను వేరుగా చూడ‌లేము. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరేమో అన్నంతగా అన్యోన్యంగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసే వెళ్తుంటారు. అయితే జీవిత‌ రాజ‌శేఖ‌ర్ తాజాగా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో త‌మ ప్రేమకథ గురించి వెల్లడించారు. వారి ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను తెలిపారు.
rajasekhar-jeevitha-love-story1రాజ‌శేఖ‌ర్ ఒక రోజు జీవిత దగ్గరకు వెళ్లి మీకు నా పై ఆసక్తి చూపిస్తున్నారేమో అని అడిగార‌ట‌. దాంతో రాజ‌శేఖ‌ర్ ముక్కుసూటితనం జీవిత‌కు బాగా నచ్చిందంట. ఇక రాజ‌శేఖ‌ర్ ను పెళ్లికి ఒప్పించేందుకు, అలాగే రాజ‌శేఖ‌ర్ ను పెళ్లి చేసుకోవడానికి ఎంతగానో క‌ష్ట‌ప‌డినట్లు జీవిత తెలిపారు. దర్శకుడు రాఘ‌వేంద్ర‌రావుకు ఈ విష‌యం తెలిసి, రాజ‌శేఖ‌ర్ విల‌న్ లా అనిపిస్తున్నాడు. అతన్ని నమ్మవద్దని, అతనితో జాగ్ర‌త్తగా అని చెప్పారంట.
rajasekhar-jeevitha-love-story2అయినా జీవిత రాజ‌శేఖ‌ర్ ను వ‌ద‌ల‌కుండా బ్రిడ్జి పై నుండి కిందకు తోసేసి, అనంతరం హాస్పటల్ లో చేర్పించి తనకు సేవ‌లు చేసి త‌న తల్లిదండ్రులను ను పెళ్లికి ఒప్పించింద‌ని రాజ‌శేఖ‌ర్ తెలిపారు. ఇంకా జీవిత మాట్లాడుతూ వేరే అమ్మాయిని రాజ‌శేఖ‌ర్ వివాహం చేసుకోవాల‌నుకున్న‌ సమయంలో ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని తెలిపింది. ఆ అమ్మాయి కారులో రాజ‌శేఖ‌ర్ ప‌క్క‌న కూర్చున్నప్పుడు వెన‌క సీట్ లో కూర్చున్న నేను చాలా బాధపడ్డానని జీవిత తెలిపింది. ఇక తాను వివాహం చేసుకోకపోయినా నాతోనే ఉంటానని చెప్పిందని, అది నచ్చిందని రాజ‌శేఖ‌ర్ వెల్లడించారు.
Also Read: పుష్ప-2 “వేర్ ఈజ్ పుష్ప” వీడియోలో… ఈ 5 విషయాలని గమనించారా..?