సూర్య నటించిన తమిళ సినిమా “సూరరై పొట్రు”. ఈ సినిమా తెలుగులో “ఆకాశం నీ హద్దురా” పేరుతో విడుదల అయ్యి అందరి ఆదరణను పొందింది. ఈ సినిమా దర్శకురాలు సుధా కొంగర ఎవరో కాదు.. తెలుగు వారే. కాకపోతే ఆమె తమిళనాడులో సెటిల్ అయ్యారు. ఎంతో పరిణతి చెందిన దర్శకత్వం ఆమెది. ఆ ప్రతిభ ఈ సినిమా అంతా కనిపిస్తుంది.

aakasam nee haddu raa 5

వాస్తవానికి, ఎయిర్ లైన్స్ అనేది కొంచం టఫ్ సబ్జెక్ట్. చాలా మందికి దీనిపై అవగాహనా ఉండదు. కానీ, సుధా కొంగర ఈ అంశాలను ఎంతో తేలికగా అర్ధమయ్యే విధం గా దృశ్యంగా మలిచారు. సామాన్యులు కూడా ఏరోప్లేన్ ను ఎక్కాలన్న కెప్టెన్ గోపినాధ్ కల “డెక్కన్ ఎయిర్” గా రూపొందింది. ఆయన జీవిత గాధ నే సినిమాగా మలిచారు. అయితే.. కొంత కల్పితం ఉన్నప్పటికీ ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది.

aakasam nee haddu ra 1

ఈ సినిమాలో, గోపినాధ్ పాత్రను పోషించిన హీరో సూర్య జీవించేశారనిపిస్తుంది. మీరు గమనించారా..? సూర్య ఎయిర్ ఇండియా ఆఫీస్ కి వెళ్ళినపుడు.. అక్కడ ఒక లోగో కనిపిస్తూ ఉంటుంది. పైన ఉన్న ఫోటో చూడండి. ఈ లోగో మహారాజాను పోలి ఉంటుంది. విమానం ఎక్కాలంటే అది ధనికులకు సాధ్యం అవుతుంది అన్న అర్ధం వచ్చేలా ఆ లోగో ఉంటుంది.

aakasam nee haddu ra 2

అలాగే.. ఎయిర్ డెక్కన్ లోగో తీసుకోండి. ఇది పూర్తిగా ఎయిర్ ఇండియా లోగోకి ఆపోజిట్ గా ఉంటుంది. డెక్కన్ ఎయిర్ లోగో ఓ కామన్ మాన్ ను పోలి ఉంటుంది. అంటే.. సాధారణ వ్యక్తులు కూడా విమానాన్ని ఎక్కాలన్నదే ఎయిర్ డెక్కన్ ధ్యేయం అని చెప్పేందుకు ఈ లోగోను డిజైన్ చేసారని అర్ధం అవుతుంది.

aakasam nee haddu raa 3

ఈ సినిమా క్లైమాక్స్ లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది.. “రైతులు ఎగిరారు..” అంటూ అర్ధం వచ్చేలా ఉండే ఈ డైలాగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.

aakasam nee haddu ra 4

అలాగే.. విమానం ల్యాండ్ అయిన తరువాత.. అందులోంచి ఊరి వారంతా కిందకి వస్తూ ఉంటారు. ఆ సమయంలో డోర్ కి పక్కగా ఒక లోగో కనిపిస్తుంది. (పైన ఫోటో చూడండి) ఓ రైతు తన నాగలిని పట్టుకుని నడుస్తున్నట్లు దీనిని డిజైన్ చేశారు. ఇది పూర్తిగా సామాన్యుల కోసమే అన్న అర్ధం వచ్చేలా డిజైన్ చేసారు. నిజంగా గోపినాధ్ గారికి, ఆయన జీవిత చరిత్రను అర్ధవంతమైన సినిమాగా రూపొందించిన సుధా కొంగర గారికి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.