త్రిష గురించి చాలామందికి తెలియని 9 ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

త్రిష గురించి చాలామందికి తెలియని 9 ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

by Mohana Priya

“చంద్రుడిలో ఉందే కుందేలు కిందికొచ్చిందా..కిందికొచ్చి నీలా వాలిందా” ఈ పాట వచ్చి దశాబ్దం దాటినా ఆ పాటకి, అందులో తన అభినయానికి ఇంకా క్రేజ్ తగ్గలేదు..కళ్లతో ఎక్స్ప్రెషన్స్ పలికించే నటులు అతికొద్దిమంది వాళ్లల్లో త్రిష ఒకరు..

Video Advertisement

ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఇంకా అదే మార్క్ యాక్టింగ్తో, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటునే ఉంది.. అందాల నటి త్రిష ఈరోజు 39వ పడిలోకి అడుగుపెడుతోంది..ఈ సంధర్బంగా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.


#1. సినిమాల్లోకి రావడానికన్నా ముందు మోడలింగ్ చేసేది..ఫ్రెండ్స్ ప్రోద్బలంతో మోడలింగ్లో అడుగుపెట్టిన త్రిష అందాల పోటీల్లో కూడా పాల్గొంది.. 1999లో “మిస్ సేలం” “మిస్ మద్రాస్” కిరీటాలను దక్కించుకుంది. 2001లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో “మిస్ బ్యూటిఫుల్ స్మైల్” అవార్డు గెలుచుకుంది.

#2. ఫాల్గుని పాఠక్ ఆల్బమ్ సాంగ్స్ తెలియని మ్యూజిక్ లవర్ ఉండరు.. ఫాల్గుని పాఠక్ ఫేమస్ సాంగ్ “మేరీ చునార్ ఉడ్ ఉడ్ జాయే” సాంగ్లో తొలిసారిగా నటించింది త్రిష..అందులో త్రిషతో పాటు నటి అయేషా టాకియాని చూడొచ్చు..తర్వాత ప్రశాంత్ , సిమ్రాన్ జంటగా నటించిన “జోడి” సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ గా నటించి, సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

#3. త్రిష మొదటి చిత్రం “మౌనం పెసియాదే” . అందులో సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.. వరుసగా విక్రమ్, విజయ్ లతో “సామి”, “గిల్లి” చిత్రాల్లో నటించింది.. “సామి” బాలక్రిష్ణ నటించిన “లక్ష్మీ నరసింహా”గా తెలుగులో రీమేక్ కాగా.. “గిల్లి” మహేశ్ నటించిన “ఒక్కడు” మూవీ రీమేక్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.

#4. “వర్షం” సినిమాతో టాలివుడ్ కి పరిచయం అయిన త్రిష ఒవర్ నైట్ స్టార్ అయిపోయింది..ఆ చిత్రంలో త్రిష నటనకి, ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా కాని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.. ప్రభాస్ మరియు త్రిష ఇద్దరికి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం వర్షం..వర్షం కంటే ముందుగానే తరుణ్ హీరోగా నటించిన “నీ మనసు నాకు తెలుసు” మూవీ ద్వారా త్రిష తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికి వర్షం మూవీనే ఫస్ట్ సినిమాగా భావిస్తారు..ఎందుకంటే త్రిష స్ట్రెయిట్ తెలుగు మూవీ వర్షం..

#5. త్రిష మాతృభాష తమిళ్.. హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ గలగలా మాట్లాడేస్తుంది.. తమిళ్, తెలుగు, మళయాళం భాషాల్లో స్టార్ హీరోలందరి సరసన నటించింది. హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన “కట్టా మిటా” చిత్రంతో బాలివుడ్లో అడుగుపెట్టి, ఆ చిత్రంలో తన నటనతో అక్కడా మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవల విడుదలైన “96” మూవీ త్రిష కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

#6. త్రిష యానిమల్ లవర్ కూడా.. పెటా సంస్థ తరపున “గుడ్ విల్ అంబాసిడర్” గా “ఏంజిల్ ఫర్ ఆనిమల్స్” పేరిట పెటా నిర్వహించిన కార్యక్రమంలో త్రిష పనిచేశారు. అంతేకాదు “యూనిసెఫ్ సెలబ్రిటి అడ్వకేట్” గా పనిచేస్తూ బాల్యవివాహాలు,చైల్డ్ అబ్యూజ్, ఆడపిల్లలకు అక్షరాస్యత మొదలైన విషయాలపై ఫైట్ చేస్తున్నారు. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో కూడా యాక్ట్ చేసారు.

#7. 2015లో వరుణ్ అనే బిజినెస్ మాన్ తో వివాహం నిశ్చయం అయినప్పటికి , తర్వాత ఆ వివాహం రద్దైంది. దానికి కారణం పెళ్లి తర్వాత నటన కొనసాగించొద్దు అని వరుణ్ కండిషన్ పెట్టారని, అది ఇష్టం లేని త్రిష వివాహాన్నే రద్దుచేసుకున్నారని త్రిష ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

#8. త్రిష క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే వచ్చే సమాధానం తన తల్లి “ఉమాక్రిష్ణన్”..త్రిష సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు త్రిష తల్లే చూసేవారు. ఆ సంధర్బంలో తమిళ చిత్ర సీమ నుండి ఉమాక్రిష్ణన్ కి కూడా సినిమా అవకాశాలు వచ్చాయి..కమల్ హాసన్ కూడా ఉమా క్రిష్ణన్ కి ఒక పాత్ర ఆఫర్ చేస్తే తను సున్నితంగా తిరస్కరించారు..తల్లికూతుళ్లు ఇద్దరూ కలిసి కొన్ని యాడ్స్ లో నటించారు. తన తల్లే తన బలం, తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం తన తల్లితో ముడిపడి ఉంటుందని త్రిష ఒక సందర్భంలో అన్నారు. త్రిష ఫాధర్ క్రిష్ణన్ 2012లో కార్డియాక్ అరెస్ట్ తో మరణించారు.

#9. చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అంటుంటారు కదా..త్రిష మాత్రం క్రిమినల్ సైకాలజిస్ట్ కాబోయి యాక్టర్ అయింది. కేవలం ఒకటి రెండు సినిమాలతో తెరమరుగయ్యే హీరోయిన్లున్న ఈ రోజుల్లో రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు.ఇలాగే మరికొంతకాలం తన నటనతో ప్రేక్షకుల మది దోచుకోవాలని కోరుకుంటూ..Once again Happy bday “EXPRESSION QUEEN”.


You may also like