‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ ని మా బిడ్డ కూడా అనుభవిస్తోంది : “ఉపాసన” ఎమోషనల్ ట్వీట్..!!

‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ ని మా బిడ్డ కూడా అనుభవిస్తోంది : “ఉపాసన” ఎమోషనల్ ట్వీట్..!!

by Anudeep

Ads

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో దేశవ్యాప్తంగా మూవీ టీంకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ.. బెస్ట్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ రెండు క్యాటగిరీ నామినేషన్ లో నిలువగా, ‘నాటు నాటు’ సాంగ్ అవార్డుని కైవసం చేసుకొంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఇద్దరు కలిసి పాడారు.

Video Advertisement

 

 

గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది ఆర్‌ఆర్‌ఆర్. ఎస్‌ఎస్‌ రాజమౌళి ‌దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. వివిధ విభాగాల్లో అంతర్జాతీయ పురస్కారాలు సైతం అందుకుంది ఆర్‌ఆర్‌ఆర్‌. ఇటీవలే ప్రపంచ చలన చిత్ర రంగం లో ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును సొంతం చేసుకున్నారు రాజమౌళి. అయితే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడం పై రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఒక ట్వీట్ చేసారు.

upasana emotional tweet about RRR and her baby..!!

ఈ అవార్డు వేడుకలకు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ క్రమంలోనే చరణ్ సతీమణి ఉపాసన.. అవార్డు గెలుచుకున్న ఆనందాన్ని పంచుకుంటూ ట్వీట్ చేసింది. “ఆర్ఆర్ఆర్ కుటుంబంలో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు నా బిడ్డ కూడా ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్‌ని ఎక్స్పీరియన్స్ చేస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భారతీయ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డుని గెలుచుకోవడం చాలా గర్వంగా ఉంది” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది ఉపాసన.

upasana emotional tweet about RRR and her baby..!!

తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించిన తర్వాత పుట్టబోయే తమ బిడ్డ గురించి ఉపాసన మాట్లాడటం ఇదే మొదటిసారి. ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం తో కలిసి దిగిన ఫోటోని ఉపాసన ఈ సందర్భంగా పోస్ట్ చేసారు. అయితే మరోవైపు ఆర్ఆర్ఆర్ గురి అంతా ఆస్కార్ పై ఉంది. ఇప్పటికే ఈ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ కింద ‘నాటు నాటు’ సాంగ్ నామినేషన్ లిస్ట్ లో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం ఎలిజిబుల్ లిస్ట్ లో బెస్ట్ మూవీగా ఆర్ఆర్ఆర్ రేసులో నిలిచింది. జనవరి 12 నుంచి 17 వరకు ఈ ఎలిజిబుల్ లిస్ట్ కి ఓటింగ్ ఉంటుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ లో నిలవనున్నాయి.


End of Article

You may also like