దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. శ్రీలీల తాజాగా రవితేజ సరసన ధమాకాలో నటించారు. ఆ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. అందం తో పాటు అభినయం, డాన్స్ లో కూడా అదరగొడుతున్న శ్రీలీల కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయి.
Video Advertisement
టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. కుర్ర హీరోలు ఆమెనే హీరోయిన్‌గా రికమెండ్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ఏ చిత్రాలున్నాయో చూద్దాం..
#1 మహేష్ – త్రివిక్రమ్ మూవీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న SSMB 28లో ఒక హీరోయిన్ గా శ్రీ లీల నటించనుంది.
#2 బాలకృష్ణ – అనిల్ రావిపూడి
నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం లో బాలయ్య కుమార్తెగా శ్రీ లీల నటించనుంది.
#3 రామ్ – బోయపాటి శ్రీను
రామ్ పోతినేని కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం లో శ్రీ లీల కథానాయిక.
#4 నితిన్ – వక్కంతం వంశీ
ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ, నితిన్ కాంబినేషన్ లో రానున్న నితిన్ 32 చిత్రం లో శ్రీ లీల కథానాయిక.
#5 నవీన్ పోలిశెట్టి – కళ్యాణ్ శంకర్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ల సంయుక్త సమర్పణలో, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి ఒక చిత్రం లో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఇందులోనూ శ్రీ లీలే కథానాయిక.
#6 వైష్ణవ్ తేజ్ – శ్రీకాంత్ ఎన్ రెడ్డి
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం లో పంజా వైష్ణవ్ తేజ నటిస్తున్న 4వ సినిమా లో కూడా శ్రీ లీల కథానాయిక.
#7 కిరీటి రెడ్డి – రాధా కృష్ణ రెడ్డి
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి పరిచయమవుతున్న చిత్రం లో కూడా శ్రీ లీల కథానాయికగా ఎంపికైంది. దీనికి రాధా కృష్ణ రెడ్డి దర్శకుడు.
#8 పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. ఈ చిత్రం లో ఒక హీరోయిన్ గా శ్రీలీల ఎంపికయ్యింది అని సమాచారం.