“ఉప్పెన” సినిమా ఎంత హిట్ అయిందో.. ఆ సినిమాలో నటించిన “కృతిశెట్టి” కి అంతకంటే ఎక్కువ ఫేమ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే కృతిశెట్టి కి ఆఫర్స్ క్యూ కట్టాయి. తరువాత కృతి శెట్టి కూడా వరుసగా సినిమాలకు సైన్ చేసారు. కొంచం రెమ్యునరేషన్ ను కూడా పెంచారు. మరి ఆమె టీవీ సీరియల్ లో ఎందుకు నటిస్తున్నట్లు..? అని డౌట్ వచ్చిందా..?

krithi shetty

ఆమె పూర్తి గా సీరియల్ లో నటించడం లేదు. కేవలం ఓ తెలుగు టీవీ సీరియల్ లో గెస్ట్ రోల్ చేసారు. జీ తెలుగు ఛానెల్ లో “ముత్యమంత ముద్దు” అనే సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ నటితో పాటు గా కృతి శెట్టి కూడా ఈ సీరియల్ గురించి వివరించే ప్రయత్నం చేసింది. ఈ సీరియల్ కు పాపులారిటీ తీసుకురావడం కోసమే వారు కృతిశెట్టిని సంప్రదించారు. ఈ సీరియల్ లో ప్రముఖ సీనియర్ నటి ఆమనితో పాటు, వాసు ఇంటూరి, శంకర్రావు లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.