వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు ఇటీవలే యూట్యూబ్ లో విడుదలై హల్చల్ చేసాయి.‘నీ కళ్ళు నీలి సముద్రం’ పాట ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రేడింగ్ లో కొనసాగుతుంది. ఒక పాట తోనే ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి…ఏప్రిల్ 2 న ఈ సినిమా విడుదల అవ్వాలి.లోక్ డౌన్ వల్ల సినిమా ఈ సినిమా వాయిదా పడింది.కరోన కారణంగా  మరి కొన్ని రోజులు థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేదు.

Video Advertisement

Uppena Heroine Krithi Shetty Images

ఇది ఇలా ఉండగా లాక్డౌన్ కి ముందు విడుదల కావలసిన సినిమాలు కొన్ని ఇప్పుడు  ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంలలో తమ సినిమాలను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు చిత్ర నిర్మాతలు. తాజాగా జ్యోతిక నటించిన   ‘పొన్ మగళ్ వందాళ్’ అమెజాన్  ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.చిన్న, మీడియం రేంజి సినిమాల్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ బాగానే ఆకర్షిస్తున్నాయి.

తాజాగా ‘ఉప్పెన’ సినిమా ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో 16కోట్లు ఆఫర్ వచ్చిందట. కానీ చిత్ర నిర్మాత ఈ ఆఫర్ ని వదులుకున్నారు అంట.. ఈ సినిమా కి  25 కోట్ల  వరకూ బడ్జెట్ పెట్టారని సమాచారం. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేస్తే చాలా వరకు నష్టం వస్తుంది అని భావించి ఓటిటి ఆఫర్ ను రిజెక్ట్ చేశారట.ఇంకా థియేటర్ లో ఉప్పెన సినిమా చూడాలి అనుకుంటే  కొద్దికాలం వెయిట్ చేయాల్సిందే.