ఆ మాటల వల్లే సివిల్స్ లో ర్యాంక్ సాధించింది..! ఈమె సక్సెస్ స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

ఆ మాటల వల్లే సివిల్స్ లో ర్యాంక్ సాధించింది..! ఈమె సక్సెస్ స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

by Mohana Priya

Ads

యూపీఎస్సీ. ఈ పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలుసు. ఎంతో పట్టుదల, శ్రమ, ఓపిక ఉంటే కానీ ఇలాంటి పరీక్షల్లో విజయం సాధించలేరు. అందుకే ఈ పరీక్షల్లో విజయం సాధించిన వారిని ఎంతో గొప్పగా చూస్తారు. అంత కష్టం మరి. ఇలా యూపీఎస్సీలో ఉన్నత ర్యాంక్ సాధించారు హైదరాబాద్ కి చెందిన స్నేహజ జొన్నలగడ్డ.

Video Advertisement

స్నేహజ సోమాజిగూడలో ఉంటారు. స్నేహజ తండ్రి జె వెంకటేశ్వర్ చార్టెడ్ అకౌంట్ గా చేశారు. తల్లి సుజాత ప్రభుత్వ ఉద్యోగి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా కూడా సుజాత విధులు నిర్వర్తించారు. ఖైరతాబాద్ లోని నాసర్ స్కూల్ లో చదివిన స్నేహజ, సిఏ చదివారు. ఖైరతాబాద్ లోని విజయ ఎలక్ట్రికల్స్ లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకున్నారు.

upsc rank holder snehaja

స్నేహజ తండ్రి సివిల్స్ అంటే చాలా ఆసక్తి ఉండేది. కానీ సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేక సివిల్స్ రాయలేకపోయారు. ఈ విషయాన్ని తనతో పంచుకున్నారు. అప్పుడు స్నేహజ సిఎ విద్యార్థులకు ఆడిటింగ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ పాఠాలు చెప్పేవారు. అంతే కాకుండా, ఒక ఆడిట్ కంపెనీలో కూడా ఉద్యోగం చేసేవారు. సమాజ సేవ మీద ఉన్న ఆసక్తితో చిన్నారులకి సంరక్షణ కోసం పని చేసే ఒక ఎన్జీవోతో స్నేహజ పనిచేస్తున్నప్పుడు, తన తండ్రి ఆశయాన్ని తాను ఎందుకు పూర్తి చేయకూడదు అని అనిపించి సివిల్స్ వైపు ప్రయాణించారు.

upsc rank holder snehaja

మొదటి రెండు ప్రయత్నాలలో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. దాంతో తల్లిదండ్రి స్నేహజకి ధైర్యం చెప్పేవారు. ఎంతో మంది, “మీ అమ్మాయి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు” అన్నా కూడా, స్నేహజ తండ్రి తనకి మద్దతుగా మాట్లాడి, తనలో కాన్ఫిడెన్స్ నింపేవారు. ఈ మాటల వల్లే తాను మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో గ్రూప్‌ బీ సర్వీస్‌ సాధించారు. కానీ తన లక్ష్యం అది కాకపోవడం వల్ల అటువైపు వెళ్ళలేదు. తర్వాత నాలుగవ ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 103వ ర్యాంక్ సాధించారు.

upsc rank holder snehaja

2016 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌) అధికారిగా నియమితులు అయ్యారు. స్నేహజ భర్త పేరు రోహిత్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో అధికారిగా చేస్తున్నారు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. వారికి ఒక పాప కూడా ఉంది. స్నేహజ ఉద్యోగం ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో కావడంతో, ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ రోహిత్ తనకి ధైర్యాన్ని ఇస్తారు అని స్నేహజ చెప్పారు. అంతే కాకుండా తన అత్తమామలు కూడా ప్రోత్సహిస్తారు అని అన్నారు. ఇవన్నీ మాత్రమే కాకుండా, చైనాలో సెకండ్ సెక్రటరీగా కూడా స్నేహ విధులు నిర్వహించారు.

ALSO READ : “జై శ్రీరామ్” అంటూ షారుఖ్ ఖాన్…నిజమైన కింగ్ నువ్వే అంటున్న ఫ్యాన్స్.! అసలేమైంది?


End of Article

You may also like