Ads
ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి మనిషి యొక్క సహజమైన కోరిక. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎందరో సలహాలు పాటిస్తూ ఇంటి నిర్మాణం చేపడతాం. అయితే చాలామంది వాస్తు ని కొట్టి పారేస్తారు కానీ వాస్తు అనేది ఇంటికి చాలా అవసరం. ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉన్నట్లయితే అది మనిషి ఆరోగ్య మీద, సంపద మీద, సంబంధాల మీద తీవ్ర ప్రభావాలని చూపిస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.
Video Advertisement
అందుకే వాస్తు ప్రకారం ఇంటిని ఎలా సర్దుకోవాలో వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి ఫోటోని ఉంచడం చాలామంది అదృష్టంగా భావిస్తారు. ఇది ఇంటికి ఆనందాన్ని శాంతిని తీసుకువస్తుంది. అలాగే మంచం యొక్క తల భాగం కూడా దక్షిణం వైపు ఉండేలాగా చూసుకోవాలి.
అప్పుడే ధ్రువాల నుంచి వచ్చే అయస్కాంత తరంగాలు హాని చేయవని చెబుతారు. అలాగే డ్రాయింగ్ రూమ్లో, హాల్లో పచ్చని మొక్కని ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచాలి. దక్షిణ దిశలో ఉండే పచ్చని మొక్క వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి చేస్తుంది. నిజానికి దక్షిణ దిశ ఇంటికి చాలా శుభప్రదం అని చెప్తారు. దక్షిణ దిశను పూర్వికుల దిక్కుగా చెప్తారు.
కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ స్వరూపమైన చీపురుని దక్షిణ దిశలో ఉంచడం చాలా మంచిది. చీపురు ని దక్షిణ దిశలో పెట్టడం వలన కుటుంబానికి ఐకమత్యం సమకూరడమే కాకుండా ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. చీపురు విషయంలో అశ్రద్ధ చూపిస్తే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదని పెద్దలు సైతం చెప్పడం గమనార్హం. వీటిని కొట్టిపారేయటానికి లేదు ఎందుకంటే ఆనాటి వాస్తుని నేటి సైన్స్ కూడా ధ్రువీకరించింది. ప్రతి వాస్తు విషయంలోని సైంటిఫిక్ రీజన్ ఉన్నట్లు నేటితరం వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
End of Article